–డాక్టర్లు, సిబ్బంది ప్రజల కోసం పనిచేయాలి
–వారంలో నల్గొండ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మార్పు కనిపించాలి
–పనిచేయని వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారా యణరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ జీతం పొందుతూ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రజల కోసమే పనిచేయా లని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి (Narayana Reddy)అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో (In Govt Medical College) ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యు లు,అధికారులు, హెచ్ఓడీలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారు లు, కళాశాల ప్రిన్సిపాల్ లతో సమావేశ మయ్యారు.తాను జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని (Government main hospital) సందర్శించడం జరిగిందని, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి లో అనేక మార్పులు రావా ల్సి ఉందని అన్నారు. వారం రోజు ల్లో ఆసుపత్రిలోని ఆయా డిపార్ట్మెం ట్ల వారిగా సమీక్ష నిర్వహిస్తానని, ఇందుకు హెచ్ ఓ డి లు కార్యాచర ణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
అధికారులు, సిబ్బం ది, డాక్టర్లు సమయపాలన పాటిం చాలని, శానిటేషన్ ను మెరుగుపర చాలి ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవా న్ని పెంపొందింపజేయాలని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (COLLECTOR) ప్రతిరోజు రెండు గంటలు, తాను ప్రతివారం జిల్లా ఆస్పత్రి పై సమీక్షిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఒక జిల్లా అధికారి జిల్లా ఆస్పత్రికి వచ్చే ఏర్పాటు చేసి అందరి హాజరును పర్యవేక్షిస్తామని, తక్షణ సమస్యల ను వెంటనే పరిష్కరిస్తామని చెప్పా రు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలకు ఎక్కడైనా కొరత ఉన్నట్లయితే వెంటనే ఏర్పా టు చేస్తామని, ఆసుపత్రిలో పారి శుధ్య నిర్వహణను మెరుగుపర చాలని, కిందిస్థాయి సిబ్బంది ప్రవర్త నలో మార్పు రావాలని, రోగులు వారి సహాయకుల నుండి ఎవరైనా డబ్బులు (MONEY) అడిగితే జైలుకు (JAIL) పంపి స్థానని, డ్యూటీ డాక్టర్లు డ్యూటీ టైం లో ఆసుపత్రిలోనే ఉండాలన్నారు.
హెచ్ ఓ డి (HOD)ల నియంత్రణలోనే అందరూ పని చేయాలని,జిల్లా ఆస్పత్రిలో అన్ని విభాగాలు, హెచ్ ఓడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, జిల్లా కలెక్టర్ కార్యాల యంలో ఏర్పాటుచేసే కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిరోజు నిరంతర పరిరక్షణ ఉంటుందని, అత్యవసర మందులను ఏర్పాటు చేస్తామ న్నారు. టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూసుకోవా లని, ఎక్కడ చెత్త కనిపించకూడ దని, ఉన్న వనరులను సద్వినియో గం చేసుకోవాలని కోరారు.వారంలో అన్ని వార్డులలో మరమ్మతులు పూ ర్తి కావాలని, మున్సిపల్ ద్వారా ప్రతిరోజు ఆసుపత్రిలో చెత్తను తీసి వేసే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిరోజు తాగునీరు ఆసుపత్రికి వచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నా రు. విద్యుత్ శాఖ (Electricity Department)ద్వారా సక్రమం గా విద్యుత్ సరఫరా ఉండేలా చూ డాలని, శానిటేషన్, భోజనం కాంట్రా క్టర్లు తప్పు చేస్తే జైలుకు పంపిస్తామ ని హెచ్చరించారు.వచ్చే బుధవారం సమీక్ష నాటికి ఆస్పత్రిలో పూర్తిస్థా యిలో మార్పు కనిపించాలని, ప్రతి ఒక్కరు టీం వర్క్ చేయండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర మాట్లాడారు. ప్రభుత్వ ప్రధా న ఆస్పత్రి సూపరింట్టిం డెంట్ నిత్యా నంద్, డిసిహెచ్ఎస్ మాతృ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజ కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి ,టి ఎస్ ఎం ఐ డి సి, విద్యుత్తు ఎగ్జిక్యూటివ్ ఇంజ నీర్లు, ఆయా హెచ్ ఓ డి లు, స్టాఫ్ నర్స్, పారామెడికల్ సిబ్బంది తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.