–ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి
— నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ,ప్రైవేట్ ఆసుపత్రులలో (Government and private hospitals) సాధా రణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)అన్నా రు .మంగళవారం ఆయన నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్, ల్యాబ్, టెస్టింగ్ రిపోర్ట్స్ ను పరిశీలించారు.వర్షాకాలం కారణం గా సీజనల్ వ్యాధులు ప్రభలెందుకు అవకాశం ఉందని, అందువల్ల ఈ అంశంపై ఎక్కువ దృష్టి సారించాలని, ఎవరైనా జ్వరం,జలుబు, ఇతరత్రా వ్యాధులతో ఆసుపత్రికి వచ్చినట్లయితే తక్షణమే వారికి చికిత్స అందించాలని, సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ప్రసవానికి వచ్చిన వారి వివరాలను ,నమోదైన గర్భిణీ స్త్రీల వివరాలను ఆయన పరిశీలించారు.అంతేకాక ఫోన్ ద్వారా వారితో మాట్లాడి సాధారణ ప్రసవం జరిగిందా లేక సిజేరియన్ అయ్యిందా అని అడిగి తెలుసుకున్నారు.పి హెచ్ సి లో డాక్టర్లు,సిబ్బంది ఎలా చేసుకు న్నారని అడిగారు.
డాక్టర్ తో మాట్లాడుతూ సాధ్యమైనంతవరకు ఆపరేషన్ లేకుండా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు కృషి చేయాలని అన్నారు. ఇందుకుగాను ముందుగానే ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎం, నర్సులు గర్భిణీ స్త్రీలను (Hospital staff, ANM, nurses pregnant women) ముందు నుండి కౌన్సిలింగ్ చేయాలని, సాధారణ ప్రసవం జరిగేలా వారిని చైతన్యం చేయాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి (Private hospital) వెళితే ఆపరేషన్ తప్పనిసరిగా చేస్తారని, అలా కాకుండా వాటిని తగ్గించుకునేం దుకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని సూచించాలని కోరారు.అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసి వంట గదిని, పరిసరాలను పరిశీలిం చారు .మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మోడల్ పాఠశాలగా ఎంపిక చేయడం జరిగిందని, మోడల్ పాఠశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అంచనాలు రూపొందించి పంపించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులను చదువుతోపాటు, క్రీడల పట్ల ప్రోత్సహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుదు, ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం దగ్గరలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని (Boys Hostel)) పరిశీలించారు .ఈ వసతిగృహంలో రెండు గదులు తప్ప తక్కినవి శిథిలావస్థలో ఉండడం గమనించి తక్షణమే భవన మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని పంచాయతీరాజ్ ఈ ఈని ఆదేశించారు. అప్పటివరకు పక్కనే ఉన్న స్త్రీ శక్తి భవన్లోకి (Stri Shakti Bhavan)మార్చాలని తెలిపారు.ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధి కారి ,పాఠశాల ప్రధానోపాధ్యా యులు తదితరులు ఉన్నారు.