Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET: నీట్ పరీక్ష ఫలితాలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి

*నీట్ పరీక్ష పత్రాల లీకేజీ పట్ల ప్రధాని స్పందించాల

NEET: ప్రజా దీవెన, కోదాడ:నీట్ పరీక్ష (NEET exam) పత్రాల లీకేజీ పై ప్రధాని మోడీ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో (Ranga Theater Square) PDSU, PYL ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి, పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చందర్రావు (Chandra Rao) పాల్గొని మాట్లాడుతూ దేశంలోని 24 లక్షల మంది విద్యార్థులు డాక్టర్ చదువుల కోసం నీట్ పరీక్షలు రాశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పత్రాలు లీకేజీ జరిగి 24 లక్షల మంది విద్యార్థులను అన్యాయంకు గురిచేసిందని దానికి కారకులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కనీసం స్పందించకుండా విదేశాల్లో తిరుగుతూ ప్రధాని తన పబ్బం గడుపుకుంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మోడీ (modi)అంటేనే నిజాయితీ నిబద్ధత అని చెప్పుకునే బిజెపి ప్రభుత్వం (bjp government) నేడు లీకేజీలతో పాలన కొనసాగిస్తూ విద్యార్థులు ఆత్మహత్యలకు (Students commit suicide)కారకులు అవుతున్నారని వారు ఉన్నారు. వెంటనే నీటి పరీక్షను రద్దుచేసి తిరిగి నిర్వహించాలని ఎన్టియే ను ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ (demand) చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు తెలుగు విద్యార్థులకు జరిగిన అన్యాయం పట్ల కనీసం స్పందన లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే తెలుగు రాష్ట్రాల్లోనికి కేంద్ర మంత్రులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. నీట్ పరీక్ష పత్రాలు లీకేజీ పట్ల దేశ ప్రధాని స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా దశల వారి ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు వేణు, PDSU, PYL కోదాడ టౌన్ (Kodada Town)నాయకులు హరీష్, హుజాఫ్ అల్లీ, నవీన్, రాకేష్, వివేక్, పవన్, అభిలాష్, సాయి సోహన్, సోమేష్, యశ్వంత్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.