Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

New laptops: సరసమైన ధరల్లో సరికొత్త ల్యాప్‌టాప్స్‌ వచ్చేశాయ్ 

--అందుబాటులో అత్యుత్తమ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ల్యాప్‌టాప్స్

సరసమైన ధరల్లో సరికొత్త ల్యాప్‌టాప్స్‌ వచ్చేశాయ్ 

–అందుబాటులో అత్యుత్తమ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ల్యాప్‌టాప్స్

ప్రజా దీవెన/న్యూఢిల్లీ: అభిమానులు తక్కువ ధరలో అత్యుత్తమ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉన్న మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా అంటూ ఎలక్ట్రానిక్స్ సంస్థలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. మీకోసం అవేమిటో తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నాం. మేం మీకోసం చవకైన ధరలకు కొనుగోలు చేయగల కొన్ని బెస్ట్ ల్యాప్‌టాప్స్‌ను తీసుకొచ్చాం.

ఈ ల్యాప్‌టాప్‌లు MSI, లెనోవో, ఏసర్ వంటి టాప్ బ్రాండ్‌లకు చెందినవి కావడం విశేషం. ఇవి విద్యా, వ్యాపార ప్రయోజనాలు అందించడమే కాకుండా ఇష్టమైన షోలను చూడటానికి, వెబ్‌ని బ్రౌజ్ చేయడానికి లేదా సోషల్ మీడియాలో కనెక్ట్ చేయడానికి అనేక ఫీచర్లు అందిస్తాయి.

అవి హై స్టోరేజ్ కెపాసిటీతో కూడా వస్తాయి కాబట్టి ముఖ్యమైన ఫైల్స్‌, డేటాను సురక్షితంగా ఉంచుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ల్యాప్‌టాప్‌ల డీటైల్స్, వాటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లను చూద్దాం.

MSI ఆధునిక 15…ఇది MSI నుంచి రిలీజ్ అయిన అత్యుత్తమ బడ్జెట్ ల్యాప్‌టాప్, MSI కంపెనీ హై-ఎండ్ ల్యాప్‌టాప్‌ల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇది 8GB RAM, 512GB స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంది. ఇది 11వ తరం ఇంటెల్ కోర్ i3-1115G4 ప్రాసెసర్, ఇంటెల్ UHD గ్రాఫిక్స్‌తో నడుస్తుంది. ఇవి ల్యాప్‌టాప్‌ను వేగంగా, స్మూత్ గా రన్ చేస్తాయి, హై-క్వాలిటీ దృశ్యాలను అందిస్తాయి. ఇది 180-డిగ్రీ లే-ఫ్లాట్, ఫ్లిప్-ఎన్-షేర్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంది, ఇది స్క్రీన్‌ను ఇతరులతో సులభంగా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్‌లో రూ.34,490కి దొరుకుతుంది.

జియో బుక్ 11 (2023)…ఇది తక్కువ ధరలో లభించే మరో ల్యాప్‌టాప్. ఇది 11.6-అంగుళాల HD యాంటీ-గ్లేర్ స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇది కళ్ళను కాంతి నుండి కాపాడుతుంది. దీని బరువు కేవలం 990 గ్రాములు మాత్రమే, ఇది సులభంగా తీసుకువెళ్లడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ MT8788 CPUతో శక్తివంతమైన పనితీరును ఆఫర్ చేస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌ను ఎస్‌డీ కార్డ్‌తో 256GB వరకు విస్తరించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో 4000 mAh బ్యాటరీ ఎక్కువసేపు బ్యాకప్ అందిస్తుంది. ఇందులోని 2MP ఫ్రంట్ కెమెరాను వీడియో కాల్స్ కోసం ఉపయోగించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్‌లో రూ.14,701కి సొంతం చేసుకోవచ్చు.

లెనోవో ఐడియాపాడ్ స్లిమ్ 3…ఈ ల్యాప్‌టాప్‌లో 11వ తరం ఇంటెల్ కోర్ i3-1115G4 ప్రాసెసర్ ఉంది, అది 4.1GHz వరకు వెళ్లగలదు. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఓఎస్ విండోస్ 10 హోమ్ OSలో నడుస్తుంది, 15.6-అంగుళాల డిస్‌ప్లేతో మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇందులోని 8GB RAM + 512GB స్టోరేజీ చాలా అవసరాలకు సరిపోతుంది. ఇది అధిక బ్యాటరీ సామర్థ్యంతో 10 గంటల పని సమయాన్ని ఇస్తుంది. ఇందులో కంటి ఒత్తిడిని నిరోధించే యాంటీ గ్లేర్ స్క్రీన్ కూడా ఉంది. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.43,990.
ఏసర్ అస్పైర్ 3 ల్యాప్‌టాప్ AMD Ryzen 3 ల్యాప్‌టాప్…ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 OSలో నడుస్తుంది, ఇది AMD Ryzen 3 7320U ప్రాసెసర్, AMD Radeon గ్రాఫిక్‌లను కలిగి ఉంది, ఇది మీకు హై-పర్ఫామెన్స్, బెటర్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇందులోని 15.6-అంగుళాల పూర్తి HD డిస్‌ప్లే ప్రతి డిటైల్ ను చూపుతుంది. ఇందులో కంటి ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ గ్లేర్ స్క్రీన్ కూడా ఉంది. 8GB RAM + 512GB స్టోరేజ్ ని ఆఫర్ చేసే ఈ ల్యాప్‌టాప్‌ ధర అమెజాన్‌లో రూ.36,990.

HP క్రోమ్‌బుక్ X360 ఇంటెల్ సెలెరోన్ N4120 2 in 1 ల్యాప్‌టాప్….ఇది శక్తివంతమైన ల్యాప్‌టాప్, దీనిని ట్యాబ్లెట్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది టచ్ టెక్నాలజీతో కూడిన 14-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది డాక్యుమెంట్స్‌, ప్రెజెంటేషన్లను రూపొందించడానికి ఉపయోగపడే అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది. గూగుల్ అసిస్టెంట్‌, 12 గంటల బ్యాటరీ లైఫ్ వంటివి ఇందులోని హైలెట్ ఫీచర్లు. ఈ ల్యాప్‌టాప్‌ అమెజాన్‌లో రూ. 28,389కి లభిస్తుంది.