ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య?
ప్రజా దీవెన / తూప్రాన్ :తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ శివారులో శివంపేట మండలం గుండ్లపల్లి కి చెందిన విభూతి సురేష్ (28) సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తూప్రాన్ పోలీసులు తెలిపారు. గుండ్లపల్లికి చెందిన సురేష్ జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఇస్లాంపూర్ వచ్చి జీవిస్తున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందాడు. పోయి కట్టెలు తెచ్చేందుకు వెళ్లి శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.