Polling: శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ
ఎన్నికల ప్రక్రియలో బాగా పనిచేసి పనిచేసి పార్లమెంటు ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీల కులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ అన్నారు.
కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీల కులు మనోజ్ కుమార్ మాణిక్ రా వు సూర్యవంశీ
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎన్నికల ప్రక్రియలో బాగా పనిచేసి పనిచేసి పార్లమెంటు ఎన్నికలను(Parliament Election) శాంతియుతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీల కులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలోని ఉదయాదిత్య భవన్ లో పార్లమెంటు ఎన్నికల సందర్భం గా నియమించిన ఎన్నికల సూక్ష్మ పరీక్షలకుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల(Parliament Election conduct) నిర్వహణలో సూక్ష్మ పరిశీల కుల విధులు చాలా కీలకమని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన సూచించారు.
ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకు నెందుకు పోలింగ్ కేంద్రంలో గుర్తుగా చూపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తిం పు కార్డులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన పోలింగ్(Polling) సమయాలపై సైతం (ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు)అవగాహన కలిగి ఉండాలన్నారు.
పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఏమైనా సందేహాలు, అనుమానాలు వచ్చినట్లయితే తన నెంబర్ 7337046757 కి కాల్ చేయాలని తెలిపారు. ప్రతి సూక్ష్మ పరిశీలకులు బాగా పనిచేసి పార్లమెంటు ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.ఈ శిక్షణ కార్యక్రమానికి రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికల శిక్షణ నోడల్ ఆఫీసర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, మాస్టర్ ట్రైనర్ డి.బాలు, తదితరులు హాజరయ్యా రు.
Parliament Election polling conduct peaceful