ASI Promotion: ప్రజా దీవెన,కోదాడ: కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులకు ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సందర్భంగా కోదాడ నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ యేసయ్య పాస్టర్ లతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొక్కి ఆయనకు అందించి అభినందించారు.
ఈ సందర్భంగా యేసయ్య మాట్లాడుతూ శ్రీనివాసులు ముందు ముందు ఎన్నో ఉన్నత పదవులు అందుకోవాలని ఇ ప్రాంత ప్రజలకు మంచి సేవలు అందించి పేదవారిని ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ అసోసియేషన్ కోదాడ టౌన్ అధ్యక్షులుపాస్టర్ ప్రభుదాస్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు