Pensioners : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు (Pensioners ) భారీ ఊరట కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత, కుటుంబ పెన్షన్లను సమయానికి అందించాలని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ ఆదేశాల ప్రకా రం దేశంలోని అన్ని బ్యాంకులు ప్రతి నెలా చివరి వర్కింగ్ డే రోజు (చివరి పనిదినం రోజునే) లబ్ధిదా రుల ఖాతాల్లో పెన్షన్లు జమ చేయా ల్సి ఉంటుంది. అయితే, మార్చి నెల పేమెంట్లకు ప్రత్యేక నియమా లు జారీ చేసింది. ఇందుకు సంబం ధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలోనే ఆఫీస్ మెమోరండం (Office Memorandum)జారీ చేసింది. పెన్షన్లు ఖాతాల జమ చేయడంలో జాప్యం జరుగు తోందని, అది పెన్షన్లపై ఆర్థిక ఒత్తి డిని పెంచు తుందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకు న్న ట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలి పింది.
ఆర్థిక శాఖ (Department of Finance) మార్గ దర్శకాల ప్రకారం ప్రతి నెలా చివరి పని దినం రోజునే వ్యక్తిగత, కుటుంబ పెన్ష న్లను వారి ఖాతాల్లో క్రెడిట్ చేయా ల్సి ఉంటుంది. అయితే, మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు జమ చేసే విషయంలో బ్యాంకులకు కొంత వెసులుబాటు కల్పించింది. మార్చి నెల పెన్షన్లను ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీన జమ చేయాలని తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది. నెల వారీ పెన్షన్లు పొం దడంలో ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని, అది ఆర్థికంగా ఇబ్బందులకు దారి తీసి ఒత్తిడి పెరుగుతోందని (The pressure is on) పింఛనుదారులు తరుచుగా ఫిర్యాదులు చేస్తున్న క్రమంలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిం ది ఆర్థిక శాఖ. పెన్షన్లు జారీ చేయడంలో ఎలాంటి జాప్యం జరిగినే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. మార్గదర్శకాల్లో పేర్కొన్న సమయానుగుణంగా పెన్షన్లు జారీ చేయాలని, ఈ టైమ్‌లైన్ బ్యాంకులు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.