Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Perika caste: కాంగ్రెస్ ప్రభుత్వం పేరికలకు అత్మ బందువు అయింది

పెరిక కులస్తుల దశాబ్దాల కలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అమలు చేసింది. కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పేరికలకి అత్మ బందువు అయింది

దశాబ్దాల కలని వంద రోజుల్లో అమలు చేసింది

మా మద్దతు కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్ రెడ్డికే

ఎన్నికల తర్వాత పింఛన్లను పెంచి ఇస్తాం

వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ మత్తీనేనివీరయ్య

ప్రజా దీవెన నల్లగొండ:  పెరిక కులస్తుల(Perika caste) దశాబ్దాల కలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అమలు చేసింది. కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పేరికలకి అత్మ బందువు అయింది.నల్లగొండ పార్లమెంట్(Nalgonda parliament)లో ఉన్న పెరిక కులస్తుల 80 వేల ఓట్లు కాంగ్రెస్ కే. మా మద్దతు కుందూరు రఘు వీర్ రెడ్డికే. ప్రతి ఒక్కరు రఘువీర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని,పెరిక కుల కార్పొరేషన్ సాధకులు, వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ మత్తీనేనివీరయ్య పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘు వీర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుండి చేపట్టిన విజయ సంకల్ప యాత్ర 2 అబ్దుల్లాపూర్ మేట్, ఇబ్రహీం పట్నం, మాల్, చింతపల్లి మీదుగా శనివారం నాగార్జున సాగర్ నియోజక వర్గం నికి చేరింది.పెరిక కులస్తులు, ఫించన్ దారులు నిడమానూరు, త్రిపురారం మండలం లో ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కి ముక్త కంఠంతో మద్దతు తెలిపారు. అనంతరం ఇండ్ల కోటయ్య గూడెం, బెజ్జీకల్, మర్రి గూడ, చెన్నాయి పాలెము తో పాటు పలు గ్రామాలలో పెరిక కులస్తులు, ఫించన్ దారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికలాంగులకు 6000, వితంతువులకు వృద్దులకు, ఒంటరి మహిళలు, కల్లు గీత, చేనేత కార్మికులు కు రూ.4000 పెన్షన్ ఇచ్చి తీరుతామని అన్నారు. కేంద్రం లో అధికారం లొకి వస్తే వికలాంగుల కి 6 న్యాయాలు చేస్తామని, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించామని అందులో ముఖ్యంగా స్థానిక సంస్థల లో (జడ్పీటీసీ ,ఎంపీటీసీ , సర్పంచ్)రిజర్వేషన్లు ఇస్తామని, వికలాంగుల హక్కుల చట్టం 2016 సంపూర్ణంగా అమలు, బ్రెయిలీ స్క్రిప్ట్(Braille script), సైన్ లాంగ్వేజ్(sign language) కి భాషలు గా గుర్తించడం లాంటి సంక్షేమ అంశాలు ఉన్నాయని తెలిపారు.

ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కు ఓటు వేసి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసోసియేట్ అద్యక్షుడు కోట మల్లికార్జున్ రావ్, మాజీ ఎంపీపీ, పెరిక కుల సంఘం రాష్ట్ర నాయకులు అంకతి వెంకట్ రమణ, నిడమానూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెరిక కుల సంఘం నియోజక వర్గ ఇంఛార్జి అంకతి సత్యం, కుల సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ సర్పంచ్ మైలార్శెట్టి సైదయ్య, కొనకంచి లక్షమయ్య, పోకల వేంకటేశ్వర్లు, జిల్లా, మండల, పెరిక, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Perika caste support congress party