పోడు భూమి పట్టాలు పంపిణీ ప్రారంభం
పంపిణీ చేసిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ
ప్రజా దీవెన/భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మొత్తం 50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాలు పంపిణీ పోడు భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.పోడు రైతుల సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పోడు పట్టల పంపిణీ ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా పంపిణీ చేశారు ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ సుగుణ ఫంక్షన్ హాల్ నందు అర్హులైన పోడు రైతులకు ఆయా పట్టాలను లాంఛనంగా పంపిణీ చేశారు.
తొలుత సభలో నిన్న అకాల మరణం చెందిన వేద సాయిచంద్ మృతికి నివాళిగా రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. అనంతరం కొత్తగూడెం లో 4541 మందికి గాను 15311.27ఎకరాలు, భద్రాచలం లో 6,515 మందికి గాను 16211.02 ఎకరాలు, ఇల్లందులో 12,347 మందికి గాను 36,588.37 ఎకరాలు, పినపాకలో 15962 మందికి గాను 52,438.39 ఎకరాలు, అశ్వారావుపేటలో 9,418మందికి గాను 25,817.15 ఎకరాలు, వైరాలో 1,812 మందికి గాను 4,826.40 ఎకరాలు జిల్లాలో మొత్తం 50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాలు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ పట్టాలు పొందిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్, రైతు బందు పథకాలను వర్తింపజేస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం లో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వర రావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్ అనుదీప్, ITDA PO గౌతమ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.