Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gutta sukhender reddy : కారు పార్టీలో ‘ కాక’

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీ కారు పార్టీలో 'కాక 'పుట్టింది. రాజకీయాల్లో కాకలు తీరిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కారు పార్టీలో కాకకు కేంద్ర బిందువయ్యాడు.

అధినేత కెసిఆర్ పై సీనియర్ నేత గుత్తా సీరియస్
చెప్పుడు మాటలు విని చెడిపో యారంటూ చెడుగుడు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్యంగా పరోక్ష ఆరోపణలు
గుత్తా వ్యాఖ్యలతో బిఆర్ఎస్ లో రాజకీయ దుమారానికి తెర
ఉరుమడ్ల రాజకీయాలతోనే ఉక్కిరి బిక్కిరoటున్న క్యాడర్
బంధువైన సీఎం రేవంత్ తో గుత్తా ఫ్యామిలీ టచ్ లో ఉందని ప్రచారం
పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందన్న సుఖేందర్ రెడ్డి
ఉమ్మడి జిల్లాలో లిల్లీ ఫూట్ లు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు
కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమ య్యే వ్యాఖ్యలని సర్వత్రా చర్చ
పార్టీ మారేది లేదంటున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు(parliament elections) సమీపిస్తున్న తరుణంలో గులాబీ కారు పార్టీలో ‘కాక ‘పుట్టింది. రాజకీయాల్లో కాకలు తీరిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta sukhender reddy) కారు పార్టీలో కాకకు కేంద్ర బిందువయ్యాడు. సుఖేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పైనే బాణం ఎక్కుపెట్టారంటే పార్టీ మారే ఆలోచనకు బలం చేకూరినట్టే అని గులాబీ పార్టీలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీలో ఉన్న అందరితో సత్సంబంధాలు కొనసా గిస్తూ చిన్న పెద్ద నాయకులతో కాక గా పిలుచుకునే వారికి సంబ్రమాశ్చ ర్యాలు కాకపోయినా పార్టీని ఓ కుదుపు మాత్రం కుదిపింది.

గులాబి పార్టీ అధినేత కెసిఆర్ పైనే సీనియ ర్ నేత గుత్తా సీరియస్ కావడం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయా ల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిం ది. చెప్పుడు మాటలు విని చెడిపో యారంటూ చెడుగుడు ఆడడంతో అంతా అవాక్కయ్యారు. ఒక విధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్యంగా పరోక్ష ఆరోపణలు చేయ డంతో బిఆర్ఎస్ లో రాజకీయ దుమారానికి తెరతీసిందని చెప్ప వచ్చు. మొత్తానికి స్వస్థలమైన చిట్యాల మండలం ఉరుమడ్ల రాజకీయాలతోనే ఉక్కిరి బిక్కిరి నెలకొందని క్యాడర్ బహిరOగగానే చర్చించుకుంటున్నారు. అదే సమ యంలో బంధువైన సీఎం రేవంత్ (CM Revanth)తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత నుంచే గుత్తా ఫ్యామిలీ టచ్ లో ఉందని ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగు తోంది.

త్వరలో కాంగ్రెస్ తీర్థం తీసు కుంటారని అందుకే తాజాగా గుత్తా చేసిన వ్యాఖ్యలని గుసగుసలాడు కుంటున్నారు. దీంతో గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది, అంత ర్గత కలహాలు ఇంతలా ఆ పార్టీని వెంటాడుతున్నాయంటే పార్టీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందా, ఇక కారు పార్టీ అయిపోయినట్టేనా ఇలా రకరకాల ప్రశ్నలతో రాజకీయ దుమారం చెలరేగింది.తాజాగా గుత్తా మీడి యా వేదికగా చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీ యాంశంగా మారింది.

పార్టీపై గుత్తా సీరియస్ వ్యాఖ్యా లు… తనకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి ఆరు నెలలుగా కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు వ్యా ఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పడి పదే ళ్ల పాటు అధికారంలో ఉంది బీఆర్ ఎస్ పార్టీ (BRS Party)కేసీఆర్ పాలనను చూసి న తెలంగాణ ప్రజలు ఈ సారి అసెం బ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని పక్కన పెట్టే శారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొ చ్చాడు ప్రజలు ఆ పార్టీ అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి గులాబీ పార్టీకి కష్టాలు రెట్టింపయ్యాయి.

దీంతో బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉండలేక కారు దిగిపోతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ ల వైపు పక్క చూపు చూస్తు న్నారు.పార్టీ నాయకత్వంపై నేతల కు విశ్వాసం పోయిందని, అందుకే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానిం చారు. ముఖ్యంగా కేసీఆర్ వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందన్నా రు. ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్ ను కొంపముంచాయని, బీఎస్పీ మాదిరిగానే బిఆర్ఎస్ తయారయిందని ఆయన విమర్శిం చారు. ఉమ్మడి జిల్లాలో లిల్లి ఫూట్ లను కేసీఆర్ (KCR)తయారు చేశాడని విమర్శించారు. పార్టీ నేతల అహంకారంతో బీఆర్ఎస్ ప్రజలకు దూరమైందని అన్నారు. బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ప్రజా స్వామ్యం, సమీక్షించుకునే విధానం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అం తర్గత ప్రజాస్వామ్యం, గెలుపోట ములపై సమీక్షించుకునే విధానం, సంస్థాగత నిర్మాణం లేదని సుఖేం దర్ రెడ్డి విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినలేదు… అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మాటలే అధినేత విన్నా రని, ఇతర నేతలను విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని ఆయన అన్నారు. పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే లీడ ర్లు పార్టీని వీడుతున్నారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ లో తనకు ఉచితంగా పదవులు రాలేదని సుఖేందర్ రెడ్డి అన్నారు. 16 సార్లు కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తే, తెలంగాణ వాదిగా, ఎంపీగా ఇద్దరు ఎమ్మెల్యే లు, జెడ్పిటిసిలతో కేబినేట్ బెర్త్ హామీతో బీఆర్ఎస్ లో చేరానని తెలిపారు. పార్టీలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పదవులు ఇచ్చామని, కొందరు నేతలు చేస్తు న్న విమర్శలపై మండిపడ్డారు.

తనకు ఎమ్మెల్సీ వదవి రాకుండా కొందరు అడ్డంకులు సృష్టించారని ఆయన విమర్శించారు. ఉద్యమకా రుల పేరుతో కొందరు బీఆర్ఎస్ లో గల్లాలు ఎగరవేస్తున్నారని అన్నా రు. ఉద్యమ కారుల పేరుతో అధికా రంలోకి వచ్చి చాలా మంది కోటీశ్వ రులు ఆయ్యారని ఆరోపించారు. ఒకప్పు డు 500 రూపాయలు అడుక్కున్న నేతలు, పప్పుబటాని లు అమ్ముకునే వాళ్లు కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. తనను విమర్శించే బీఆర్ఎస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవా లని, వారి బండారాన్ని అవసరమై న సమయంలో చూసు కుంటానని హెచ్చరించారు.నాపై హత్య క్రిమి నల్ కేసులు లేవని, కిందిస్థాయి నుంచి రాజకీ యంగా ఎదిగామని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ లో అంతర్గత సమస్య లు, నేతల సహాయ నిరాకరణతోనే పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గాడని సుఖేందర్ రెడ్డి చెప్పారు.

భవిష్యత్ ఏం జరు గుతుందో అమిత్ రెడ్డి నిర్ణయించు కుంటాడని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీల అనర్హత అంశాన్ని పరిశీలిస్తున్నామని, న్యాయపర మైన చిక్కులు లేకుండా సమీక్షిస్తు న్నామని సుఖేందర్ రెడ్డి చెప్పారు. బిఆర్ఎస్ నేతలకు (BRS Leaders)ఆహకారం నెత్తికెక్కిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఇంకా కొంతమంది నేతలు ఆకాశంలోనే నడుస్తున్నారని, నల్గొండ, ఖమ్మం, మహబూబూ నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాలో పార్టీ ఓడిపోవడానికి జిల్లా మంత్రు లే కారణమని ఆరోపించారు. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయని కేసీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా పార్టీ మేలుకొనకపోతే నష్టం తప్పదని హెచ్చరించారు. తనకు ఎవరి దయాదాక్షిణ్యాల మీద పదవులు రాలేదని ప్రజా నాయకుడినని చెప్పారు.కేసీఆర్ చుట్టూ ఉన్న వారే ఇతర నేతలపై తప్పుడు మాటలు చెప్పారని ఆయన ద్వజమెత్తారు.

Political war in BRS Party