Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PUSHPA2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

PUSHPA2:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం నటిస్తున్న సినిమా పేరు పుష్ప 2 (PUSHPA2). ఈ సినిమాపై ప్రేక్షకులలో వారి అంచనాలు ఉన్నాయి. ఒకవైపు ఈ పుష్ప 2 విడుదల సమయం రోజురోజుకి వాయిదా పడడంతో ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమాను ఆగస్టు 15న (On August 15)రిలీజ్ చేయాలనుకున్న కొన్ని అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడి డిసెంబర్ 6న (On December 6)థియేటర్లోకి రాబోతోంది. ఇకపోతే మేకర్స్ మాత్రం ఓ పక్క ప్లానింగ్ తో కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రేక్షకులకు ప్రకటించారు. ఇక దీని ప్రకారం ఇంకా సినిమా షూటింగ్ పూర్తి అవ్వలేదని., పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేయాల్సి ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక పుష్ప 2 సినిమా కోసం రెండు యూనిట్లు వేరు వేరు షూటింగ్ ప్రాంతాలలో షూటింగ్ (SHOOTING)జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు సినిమా పనులు త్వరగా పూర్తిచేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఫాన్స్ కు బిగ్గెస్ట్ అప్డేట్ ఏమిటి అంటే.. ఈ సినిమా నుంచి మరో పాట కూడా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ లో (Makers plan) ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా., ఇప్పటికే అల్లు అర్జున్ కూడా పుష్ప 3 (PUSHPA3) కూడా ఉంటుందని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక మరోవైపు పుష్ప 2 క్లైమాక్స్ ను కూడా మార్చాలని పుష్ప 3 (PUSHPA3)సినిమాకు లీడ్ ఇచ్చేలాగా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పుష్ప 2 సినిమాని కూడా యాక్షన్ సీన్స్ తో పాటు ఊహించని ట్విస్ట్ లతో ఉండేలాగా ప్లాన్ చేసినట్లు కూడా కనపడుతుంది. ఇక మరోవైపు సుకుమార్ (SUKUMAR) కూడా పుష్ప 3 (PUSHPA3) సినిమాకు అదిరిపోయే కథను కూడా రెడీ చేస్తున్నట్లు సినిమా బృందం తెల్పింది.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)