Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RBI New Rules: క్రెడిట్ కార్డు వారేవారికి షాకింగ్ ఆర్బిఐ న్యూ రూల్స్..!

RBI New Rules: తాజాగా ఆర్బీఐ (rbi) క్రెడిట్ కార్డ్ (credit card) చెల్లింపులన్నీ కూడా కేవలం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరిపించాలని తెలిపింది. ఈ ప్రాసెస్ కి ఆర్బీఐ జూన్ 30 డెడ్ లైన్ అని తెలిపింది. ఇది ఇలా ఉండగా కొన్ని థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లలో Credit, PhonePay మొదలైన క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు చేసుకోవడనికి వీలు ఉంది. మరో వైపు.. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు బిబిపిఎస్ విధానాన్ని అవలంబించనప్పటికీ, వారు తమ క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు IMPS, NEFT, UPI మొదలైన ఇతర చెల్లింపు పద్ధతులు, ఫోన్ పే, క్రెడిట్‌లను వాడుతున్నారు. ఇక భారత్ బిల్ పే సేవను స్వీకరించిన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించాలనే ఆర్‌బిఐ (rbi) ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తున్న ఏకైక థర్డ్ పార్టీ యాప్ పేటిఎమ్‌ మాత్రమే.

ఇటీవలి కాలంలో పేటీఎంకు పరిస్థితులు సర్రిగా లేకపోవడంతో కొన్ని కఠినమైన ఆదేశాలను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ ఇప్పుడు అది ఒక విధంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అంచనాలను అందుకోవడంలో మొదటిది.ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులు, థర్డ్ పార్టీ యాప్‌లను ‘భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్’ (BBPS) ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు చేయాలని తెలిపింది. ఈ నియమాన్ని అమలు చేయడానికి చివరి తేదీ 30 జూన్ 2024 గా నిర్ణయం తీసుకున్నారు. కానీ చాలా బ్యాంకులు, థర్డ్ పార్టీ యాప్‌లు ఈ నిబంధనను అమలు చేయడం లేదు. అదే సమయంలో పేటీఎం తన ప్లాట్‌ఫారమ్‌లో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు సదుపాయం ‘భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్’ (BBPS) ద్వారా మాత్రమే జరుగుతుందని తెలుపుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లోకి మారిన అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు బీబీపీఎస్‌ ప్లాట్‌ఫారమ్‌లో జరుపుకోవచ్చు అని తెలిపింది. పేటిఎమ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు అందరూ బీబీపీఎస్‌కి మారినప్పుడు ఈ సేవను ఈజీగా పొందవచ్చు.

ఇదిలా ఉంటే మరో పైవు జూన్ 30 తర్వాత కూడా Cred, PhonePe వంటి థర్డ్ పార్టీ యాప్‌లు ఇప్పటికీ IMPS, NEFT, UPI ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను చేయడానికి వినియోగదారులను అనుమతిస్తున్నట్లు సమాచారాం. కానీ దేశంలోని క్రెడిట్ కార్డ్ (credit cards) మార్కెట్‌లో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇంకా బీబీపీఎస్‌కి ఇంకా మారలేదు. అన్ని బ్యాంకులు కేసుల IMPS, NEFT, UPIలపై కూడా ఆధారపడతారు. ఈ నిబంధనను పాటించని అన్ని బ్యాంకులు, యాప్‌లు ఆర్బీఐ నుండి 90 రోజుల గడువు కోరినట్లు సమాచారం.. చూడాలి మరి ఆర్బీఐ నిర్ణయం ఎలా ఉండబోతుందో.