ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)సమీక్షిస్తున్నారు. ఇంటి గ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center) లో సమీక్ష సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధి కారులు హాజరయ్యారు.సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కమాం డ్ కంట్రోల్ సెంటర్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మంకు బయలుదే రుతారు. ఖమ్మంలోని వరద ప్రభా విత ప్రాంతాలను సీఎం పరిశీలించ నున్నారు.