ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి
ప్రజా దీవెన/ రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయపోల్ సమీపంలో చోటుచేసుకుంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. కందుకూరుకు చెందిన నారాయణరెడ్డి, లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీకి చెందిన భానుప్రసాద్, హస్తినాపురం ఈస్ట్ కాలనీకి చెందిన నవీన్ ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు బైక్‌పై రాయపోల్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా దూసుకొచ్చిన మారుతి వాహనం (ఏపీ28 బీఎస్ 0010) వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలొదిరారు. కాగా, భారత్ ఇంజినీరింగ్ కళాశాల హైదరాబాద్ వెళ్లే దారిలో ఉంటే.. వీరు రాయపోల్ వైపుగా ఎందుకు వచ్చారో తెలియాల్సి వుంది. కారును నడిపిస్తున్న పి.శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆసరా అవుతారనుకుంటే..: ఉన్నత చదువులు చదివి కుటుంబాలకు ఆసరాగా నిలబడతారని అనుకుంటే రోడ్డు ప్రమాదం ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాయపోల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడటంతో కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులను అప్పగించనున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు…