–మేకల యాజమానులు ఐదుగురు దుర్మరణం
–మెదక్ జిల్లా చేగుంటలో రెండు లారీలు ఢీకొట్టిన సoఘటన
Road Accident:ప్రజా దీవెన, చేగుంట: మెదక్ జిల్లా (medhak)చేగుంట లోని 44 జాతీయ రహదారిపై(On the National Highway) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (road accident) ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వడియా రం వై జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ కు చెందిన యజమా నులు ఐదుగురు దుర్మరణం చెందా రు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ (Nagpur in Maharashtra) నుంచి లారీలో మేకలు తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమం లో చేగుంట బైపాస్ (by pass)వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమా దంలో లారీ క్యాబిన్ లో కూర్చున్న ముగ్గురు మేకల యజమానులతో పాటు, వెనుక లారీలో కూర్చున్న ఇద్దరు చని పోయారు. డ్రైవర్ తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయా లయ్యాయి. దాదాపు 100 వరకు మేకలు మృత్యువాత పడ్డాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరు కుని గాయపడిన వారిలో ముగ్గు రిని గాంధీ హాస్పిటల్ కు, ఇద్దరి నీతూప్రాన్ హాస్పిటల్ కు తరలిం చారు.డ్రైవర్ అజాగ్రత్త, ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథ మికంగా నిర్ధారించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు (case) నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.