–డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణ ను వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు
Rouse Avenue Court:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో (In the liquor case) కవిత (kavitha)దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)శుక్రవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ (Charge sheet) పరిగణ లోకి తీసుకునే అంశంపై శుక్రవారం విచా రణ జరపనుంది. దీనిపై గురు వారంలోగా కౌంటర్ దాఖలు చేయా లని సీబీఐని జడ్జి కావేరి బవెజా ఆదేశించారు. అలాగే. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై వేసిన ఛార్జ్ షీట్ ను కవిత తరపు న్యాయవాది తప్పుపట్టారు. సీబీఐ కేసులో CBI case) డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న జడ్జి కావేరి బవెజా శుక్రవారాని పిటిషన్ ను వాయిదా వేశారు.
డిఫాల్ట్ బెయిల్ అంటే..
నిర్ణీత వ్యవధిలోగా పోలీసులు, దర్యాఫ్తు సంస్థలు కేసు విచారణ పూర్తిచేయడంలో విఫలమైతే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి బెయిల్ పొందే హక్కును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Criminal Procedure Code)(సీఆర్ పీసీ) కల్పిస్తోంది. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) ప్రకారం.. నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైతే.. బెయిల్ పొందే హక్కు నిందితుడికి ఉంటుంది. అయితే, ఇది కేసు తీవ్రతను బట్టి దర్యాఫ్తు గడువు వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో విచారణ పూర్తిచేయడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తే నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టి కస్టడీకి కోరాల్సి ఉంటుంది. జడ్జి 15 రోజుల వరకు కస్టడీకి (పోలీస్ లేదా జ్యుడీషియల్) అప్పగిస్తారు.