Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Election campaign : కాంగ్రెస్ వస్తే మళ్ళీ స్కాంల కాలమొస్తుంది

నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైధిరెడ్డి గెలుపే లక్ష్యంగా నల్లగొండ మండలoలో కార్నర్ సమావేశం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారం లో నల్లగొండ బిజెపి అభ్యర్థి సైదిరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:  నల్లగొండ పార్లమెంట్(Nalgonda Parliament) అభ్యర్థి శానంపూడి సైధిరెడ్డి గెలుపే లక్ష్యంగా నల్లగొండ మండలoలో కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైధిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్ లకు కోలాటలతో కోలాహాలంగా స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా బిజెపి పార్లమెంట్(BJP Parliament) అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ల(Parliament elections) ప్రచారంలో రాహుల్ గాంధీ చెప్తే ఓట్లు వేయరని కాంగ్రెస్ నేతలు భయపడుతు న్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రం లో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి పేరో, ఇంకొకరి పేరు చెప్పండి కాని రాహుల్ గాందీ పేరు చెపితే ఓట్లు వేసే పరిస్థితి లో దేశ ప్రజలు లేరని కాంగ్రెస్ నాయకులకు సైతం తెలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ ఓట్ల కోసం రాహుల్ గాంధీ పేరు కూడా చెప్పుకోలేని నీచ స్థితికి దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చిన అభివృద్ధి కుంటుపడిపోతుందని, కాంగ్రెస్ వస్తే స్కాములు(Congress scams), దోచుకోవడం తప్ప అభివృద్ధి ఉండదని, కాంగ్రెస్ వస్తే వారసత్వ పాలన తప్ప ఈ దేశానికి వరిగేదేమిలేదని తేలిపోయిందని చెప్పారు.

దేశం బాగుపడాలంటే మన భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే ప్రధాని మోడీ మరోసారి మచ్చటగా మూడో సారి అధికారం లోకి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. బిజెపి అధికారంలోకి రావాలంటే మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి 400 సీట్లలో మన నల్లగొండ యంపి సీటు ను కూడా ఉండేలా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపిం చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతా రెడ్డి శ్రీదేవి రెడ్డి పార్లమెంట్ కో- కన్వీనర్ పిల్లి రామరాజు భువనగిరి అసెంబ్లీ ప్రబారి పోతేపాక సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా అధికార ప్రతినిధి పెరిక ముని కుమార్, గడ్డం మహేష్, యువ మోర్చా అధ్యక్షుడు వంగూరి రాఖి, అసెంబ్లీ కన్వీనర్ గాయం భూపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చామకూరి మహేష్, కొత్తపల్లి ప్రమోద్, కొత్తపల్లి భూత అధ్యక్షుడు జిల్లపల్లి రాజశేఖర్, మండల కోఆర్డినేటర్ ముత్యాల నాగరాజు, కొత్తపల్లి వెంకట్ యువ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, యువమోర్చా మహిళా సెల్ కన్వీనర్ అనుముల దేవి, దుబ్బాక మల్లేష్ ముత్యాల శంకర్ రెడ్డి, శ్రీకాంత్, వినోద్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నా రు.

Scams in Congress rulling says saidi reddy