Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srisailam temple: శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికెట్

Srisailam temple: ప్రజా దీవెన, నంద్యాల: శ్రీశైలం దేవస్థానాని (Srisailam temple )కి వరల్డ్ బుక్ ఆఫ్ రికా ర్డ్స్ లండన్ సర్టిఫికెట్ ( World Book of Records London certificate) లభించిoది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానాని(Srisailam Mallanna Devasthanam )కి మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం అలానే ఆలయంలోని నంది విగ్రహానికి ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం సంపాదించుకుంది.

 

ముఖ్యంగా పురాతన పరంగా ఆధ్యా త్మికంగా సాంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మిక సత్యం యొక్క అత్యున్నత భాండాగారంతో కూడిన విలువలు గల సజీవ స్వరూపంగా పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందుకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో శ్రీశైలం ఆలయం నమోదు కాబడింది.

 

దీనితో శ్రీశైలం దేవ స్థానం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువీకరణ పత్రం దక్కించుకుంది. ఈ ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మె ల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి (Srisailam MLA Budda Rajasekhar Reddy), ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రెటరీ ఉల్లాజీ ఎలియజర్ (Ullaji Eleazar) అందజేశారు.