–డబ్బు, అభరణాల కోసం ఏకంగా యాభై పెళ్లిళ్లు చేసుకున్న వైనం
–ఎవరో మొగోడు అనుకునేరు కా దండోయ్ తమిళనాడు మహిళ
–మగవాళ్ల కంటే మేమేం తక్కువo టూ మోసాలకు పాల్పడుతున్న మ హిళలు
–చివరికి గుట్టుబట్టబయలై కట కటాల పాలైన మహిళామణి
Tamilnadu Woman: ప్రజా దీవెన తమిళనాడు: సమాజంలో ప్రస్తుతం సవాలక్ష సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎక్కడ చూసినా, ఏం మూలన చూసిన మోసాలు దగాలు రోజుకో వింత రూపంలో కళ్ళకు కట్టినట్టు కనబ డుతున్నాయి. కాలానుగుణంగా రోజురోజుకు మోసాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. అయితే మోసాలు దగాలకు సంబంధించి చాలా కాలం నుంచి మగవారినే చూస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో మహిళా మణులు సైతం ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మగవారి కంటే మేమేం తక్కువ అన్న చందంగా కొందరు ఆడవాళ్లు (womans) కూడా మగవారితో సమానంగా మోసాలకు పాల్పడుతూ షాక్ ల మీద షాకులిస్తున్నారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా డబ్బుల కోసం ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవడం వారితో కొద్దిరోజులు సంసారం చేయడం తర్వాత అందిన కాడికి క్యాష్ నగలతో ఊడాయించడం కొందరికి పరిపా టిగా మారింది.
ఇదే కోవలో తాజాగా తమిళనాడుకు (tamilnadu) చెందిన ఒక మహిళ ఏకంగా 50 మందిని పెళ్లి (50 people get married) చేసుకొని మోసం చేసిందని పోలీ సులు విచారణలో వెల్లడయింది. ఆమె 50 మందిని మోసం చేయగా వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉండడం గమనార్హం కాగా ఇప్పుడ ది సంచలనం రేపింది. తమిళనాడు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తిరువూర్ జిల్లా (Tiruvur District) తారాపు రానికి చెందిన ఓ యువకుడు తారాపురం ఉడుమలై రోడ్డులో బేకరీ, పశుగ్రాస విక్రయ కంపెనీ నిర్వహిస్తున్నాడు. అతడికి 35 ఏళ్లు కాగా ఇంకా పెళ్లి కాకపోవడం బంధువులు పెళ్లి కోసం అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఈ క్ర మంలో సదరు యువకుడికి కొడు మూడికి చెందిన సంధ్య అనే యు వతికి అంబి డేట్ ద తమిళ్ వే అనే ఇంటర్నెట్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆమె తనకు కేవలం 30 ఏళ్ళ వయసు మాత్రమే ఉందని చె ప్తూ చాలా ప్రేమగా మాట్లాడింది. దాంతో యువకుడు ఆమె బుట్టలో పడిపోయాడు. అనంతరం పళని సమీపంలోని ఓ దేవాలయంలో (temple) వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
అబ్బాయి తల్లిదండ్రులు కూడా పెళ్లికి అంగీకరించారు.3 నెలలుగా యువకుడితో కలిసి వైవాహిక జీవితాన్ని (married life) గడిపింది. అయితే ఈ క్రమంలో ఆమె చెప్పిన వయసు, శరీర రూపురేఖలు ఒకదానితో ఒకటి సరిపోకపోవడంతో అను మానం వచ్చింది. ఆమె ఆధార్ కార్డును పరిశీలించగా భర్త స్థానం లో చెన్నైకి చెందిన మరో వ్యక్తి పేరు ఉన్నట్లు తేలింది. వయస్సు కూడా భిన్నంగా ఉన్నట్లు సదరు యువ కుడు తెలుసుకున్నాడు.దీంతో దిగ్భ్రాంతికి గురైన యువకుడి కుటుంబీకులు సంధ్యను (sandya) విచా రించగా, సంధ్య ఆగ్రహం చెంది యువకుడితో పాటు అతని కుటుం బసభ్యులను బెదిరించింది.
దీంతో అప్రమత్తమైన యువకుడు యువతిని ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు (All Women Police Station) తీసుకెళ్లి జరిగిన విషయాన్ని పోలీ సులకు వివరించగా ఆ యువతి చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పెళ్లయిన కొద్ది నెలల్లోనే సంధ్య భర్తతో గొడవపడి నగలు, డబ్బుతో అజ్ఞాతంలోకి వెళ్లింది. సంధ్య మ్యా ట్రిమోనియల్ లిస్ట్‌లో, 40 ఏళ్లు పైబడిన పురుషులను ఫాలో అవు తోంది. అలా ఆమె అమ్మాయిలు కోసం వెతుకుతున్న వారిని తన బుట్టలో వేసుకొని వారి దగ్గర డబ్బులు కాజేస్తోంది. సంధ్యను పోలీసులు విచారిస్తుండగా షాపింగ్ నిజాలు బయటపడుతున్నాయి, పలువురు వ్యాపారవేత్తలు ఆమె ను పెళ్లి చేసుకుని నగలు పోగొట్టు కున్నారని, ఆ విషయాన్ని బయట కు చెప్పుకోలేక ఇబ్బంది పడుతు న్నట్లు తెలిసింది.