–రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక
— దోపిడి దొంగలను పట్టుకోవడంలో కత్తిపోట్లతో తీవ్రగాయాలు
–ఆ సాహస పోలీస్ కు కేంద్రం ఫిదా
Telangana Head Constable Yadaiah: ప్రజా దీవెన,హైదరాబాద్: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సంద ర్భంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలో 1037 మంది పోలీస్, ఫైర్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ (Police, Fire, Home Guard, Civil Defence, Correctional Services)సిబ్బందికి గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్ అందించనుంది. ఈ మేరకు అవార్డ్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు (Telangana Head Constable Yadaiah)ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్ అధికారి యాదయ్యకు దక్కడం విశేషంరాష్ట్రంలో ఇషాన్ నిరంజన్ నీలంపల్లి, రాహుల్ చైన్ స్నాచింగ్‌లు, అక్రమ ఆయుధాల సరఫరా చేసేవారు. అయితే వీళ్లిద్దరూ జూన్ 25,2022న దోపిడీకి పాల్పడ్డారు. ఆ మరుసటి సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య పట్టుకున్నాడు. అయితే . యాదయ్య నుంచి తప్పించునేందుకు నిందితులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో యాదయ్యపై దారుణంగా కత్తితో పలు మార్లు దాడి చేశారు. అయినప్పటికీ యాదయ్య వెనక్కి తగ్గలేదు. ప్రాణాల్ని ఫణంగా పెట్టి నిందితుల్ని పట్టుకున్నారు. కటకటాల్లోకి పంపారు. తీవ్రంగా గాయపడ్డ యాదయ్య 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన ధైర్య సాహాసాల్ని కేంద్రం కొనియాడింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్యాలంటరీ అవార్డ్‌ను ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది.
అవార్డులు పొందిన వారు వీరే.. రాష్ట్ర పోలీసులకు (State Police) 21 మెడల్స్ లభించాయి. అందులో ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు చడువు యాదయ్య (హెడ్ కానిస్టేబుల్), విశిష్ట సేవకు ప్రెసిడెంట్ మెడల్ – సంజయ్ కుమార్ జైన్ (అదనపు డీజీపీ ), కటకం మురళీధర్ (డీసీపీ) ఎంపికయ్యారు. అదేవిధంగా మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్-అవినాష్ మొహంతి (పోలీసు కమిషనర్-సైబరాబాద్), జమీల్ బాషా (కమాండంట్), పి.కృష్ణమూర్తి (అదనపు ఎస్పీ), కే.రాము (ఎస్సై), అబ్దుల్ రఫీక్ (ఎస్సై), ఇక్రమ్ అబ్‌ఖాన్ (ఎస్సై), శ్రీనివాస్ మిశ్రా (ఎస్సై), కే.బాలకృష్ణయ్య (ఎస్సై), ఏ.లక్ష్మయ్య (ఎస్సై), జి.వెంకటేశ్వర్లు (ఎస్సై), నూతలపాటి జ్ఞాన సుందరి (ఇన్‌స్పెక్టర్) ఉన్నారు. మెడల్ ఫర్ గ్యాల్లాంటరీ అవార్డుకు సునీల్ దత్ (ఎస్పీ), మోర కుమార్ (రిజర్వ్ ఇన్‌స్పెక్టర్), శనిగరపు సంతోష్ (రిజర్వ్ ఎస్సై), ఏ.సురేష్ (జూనియర్ కమాండో), వి.వంశీ (జూనియర్ కమాండో), కంపాటి ఉపేందర్ (జూనియర్ కమాండో), పాయం రమేష్ (జూనియర్ కమాండో ) ఎంపికయ్యారు.