— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజా దీవెన, నల్లగొండ:గ్రామస్థాయి స్థానిక సంస్థలలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి, నియమ నిబంధనల ప్రకారం 2025- 26 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళి కను రూపొందించాలని జిల్లా కలెక్ట ర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధ వారం ఆమె జిల్లా పరిషత్ సమా వేశ మందిరంలో 2025-2026 సంవత్సరానికి సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధుల వినియోగా నికై రూపొందించే కార్యచరణ ప్రణాళిక పై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అన్ని పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచా యతీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, రైతు వేదికలు అన్ని ప్రభుత్వ సంస్థలకు తాగునీరు అందించేందుకు ప్రణా ళికలో చేర్చాలని చెప్పారు. ఈ విషయమై ప్రత్యేక అధికారులు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
స్థాని క పరిస్థితులను ఆధారంగా ప్రణా ళిక రూపొందించాలని చెప్పా రు.అలాగే పాఠశాలలు ,అంగ న్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు , ఆరో గ్య ఉప కేంద్రాలు తదితర సంస్థల లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందు కు ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వాల ని ఆమె ఆదేశించారు.15 వ ఆర్థిక సంఘం ఆన్ టైడ్ నిధులకు సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, అసంపూర్తిగా మిగిలిపోయిన అంగన్వాడి పనుల పూర్తి, ప్రహరీల నిర్మాణం, అంగ న్వాడీ భవనాల మరమ్మతు, అలాగే ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన మరమ్మతులు, ప్రహరీల నిర్మాణం వంటివి చేపట్ట వచ్చని, వాటి కింద పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించా లన్నారు.
ముందుగా జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి 2025- 26 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూపొందించే ప్రణాళికపై నియమ నిబంధనలను వివరించారు. డిప్యూ టీ సీఈవో శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.