టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ గడువు పెంపు
టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ 2024 దరఖాస్తు గడువును ఉస్మానియా యూనివర్సిటీ పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 15తో ముగియాల్సిన గడువును ఏప్రిల్ 25 వరకు పెంచింది.
ఆలస్య రుసుం రూ.500లతో మే4 వరకు చాన్స్
ప్రజాదీవెన, హైదరాబాద్: (TS LAWCET) టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ (PG LAWCET ) 2024 దరఖాస్తు గడువును ఉస్మానియా యూనివర్సిటీ పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 15తో ముగియాల్సిన గడువును ఏప్రిల్ 25 వరకు పెంచింది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే రూ.500 ఆలస్యరుసుముతో మే 4 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో మే 11 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో మే 18 వరకు, రూ.4000 ఆలస్యరుసుముతో మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ చేసుకునేందుకు మే 20 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.900; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఇక పీజీఎల్‌సెట్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1100; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.900గా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3న ఉదయం10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాసెట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జూన్ 6న ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసి జూన్ 7న సాయంత్రం వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత తుది ఆన్సర్‌కీతోపాటు ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University LAWCET) లాసెట్ పరీక్షల బాధ్యతలను నిర్వహిస్తు్న్న సంగతి తెలిసిందే.
TS LAWCET PG LAWCET deadline extension