Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TS SET : తెలంగాణ సెట్ షెడ్యూల్ మార్పు

— తాజా షెడ్యూల్ విడుదల చేసిన టీ షెట్
–సెప్టెంబ‌ర్ 10వ తేది నుంచి పరీక్ష లు
–సెప్టెంబ‌ర్ 2వ తేధీ నుంచి హాల్ టికెట్స్
–ఆల‌స్య రుసుంతో ఈ నెల ఆరు వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ

TS SET :ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (Eligibility Test) (టీఎస్‌ సెట్‌)-2024 పరీక్ష తేదీ మా రింది. రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెస ర్, లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలం గాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-2024 తేదీలను మార్చినట్లు టీఎస్‌ సెట్‌( TS set) మెంబర్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ నరేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో సెట్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా యూజీసీ నెట్‌ సవరించిన పరీక్షల షెడ్యూల్ అదే తేదీల‌లో ఉండ‌టంతో సెట్‌ పరీక్షలను (Set tests) వాయి దా వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొ న్నారు. కొత్తగా ప్రకటించిన తేదీల ప్రకారం సెట్‌ పరీక్షలు సెప్టెంబరు 10 నుంచి మొదలవుతాయని తెలిపా రు. దరఖాస్తులను ఎడిట్‌ చేసుకు నేందుకు ఆగస్టు 24, 28 తేదీల్లో అవకాశం ఇవ్వనున్నట్లు వివ రించారు. హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి సెప్టెంబరు 2 నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. టీజీసెట్ దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసింది. రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు ఆగస్టు 6 వరకు సమర్పించేందుకు అవకాశం ఇచ్చారు. తెలంగాణలోని యూని వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయ డానికి అర్హత కల్పించే పరీక్ష తెలం గాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET – 2024) నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం మే 4న విడుదల చేసిన సంగతి తెలి సిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 14న ప్రారంభంకాగా, ఆగస్టు 6 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

పరీక్ష విధానం ఇలా .. తెలంగాణ సెట్‌ పరీక్ష (Telangana set exam)జనరల్‌ స్టడీస్‌, 29 సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 2 పేపర్లకు జరుగనుంది. పేపర్‌ 1లో 50 ప్రశ్నల కు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. పూర్తి వివరాలకు www. te langanaset.org, www. osma nia.ac.inను సంప్రదిం చాలన్నారు.