–టీస్యూడబ్లూజేయు నుండి టీయూడబ్ల్యూజే లో పలువురు శేరి లింగంపల్లి జర్నలిస్టుల చేరిక
TWJ: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టుల (Journalists of Telangana) సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న యూని యన్ టీయూడబ్ల్యూజే అని యూ నియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు అభిప్రాయపడ్డారు.టీయూడబ్ల్యూజే (TWJ) అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో గతంలో ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులను తీసు కువచ్చి జర్నలిస్టుల సంక్షే మం కోసం వెచ్చించిన ఘనత టియుడబ్ల్యూజేదని అన్నారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ (Serilingampally Press Club) సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నియో జకవర్గ పరిధిలోని చందానగర్ లో నిర్వహించారు. చందానగర్ లోని పీజెఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ సమావేశానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ల విట్టల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజి రెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ లు హాజరయ్యారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని దాదాపు 120 మంది జర్నలిస్టులు పాల్గొన్న ఈ సమావేశంలో యూనియన్ నాయ కులు మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టులను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములను చేసి రాష్ట్ర సాధన కోసం ఉద్య మించిన ఘనత టియుడబ్ల్యు జేదని అన్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన టీయూడబ్ల్యుజే (TWJ) అధ్యక్షుడు అల్లం నారాయణ సారథ్యంలో జర్నలి స్టుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అక్రిడేషన్ కార్డుల కంటే రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంలో రెండింతల కార్డు లను జారీ చేయించిన ఘనత టీయూడబ్ల్యుజెదని అన్నారు. జర్న లిస్టుల ఆరోగ్యానికి ప్రాధా న్యతనిస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులను సాధి oచిన విషయాన్ని గుర్తు చేశారు. టీయూడబ్ల్యూజేను విమర్శించే ఇతర యూనియన్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయి నిధు లను రాబట్టాలని సవాలు విసి రారు. శేరిలింగంపల్లి మండల పరిధిలో దశాబ్దాలుగా జర్నలిస్టు లు ఎదురుచూస్తున్న సొంతింటి కలను సాకారం చేసేందుకు ముం దుకు వచ్చిన టియుడబ్ల్యూజే, అందుకు అనుగుణంగా నియోజ కవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సహకారంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ( assembly elections) ముందు చందానగర్ లోని సర్వేనెంబర్ 174లో ఒక ఎకరం స్థలాన్ని మంజూరు చేయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో పాటు ఈ భూమి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 152లోని మరో 1 ఎకరం స్థలాన్ని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని టియుడబ్ల్యూజే తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి గత ఫిబ్రవరిలో వినతి పత్రం సమర్పించి సదరు స్థలం కోసం క్రమం తప్పకుండా ఎమ్మెల్యే, అధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళుతున్నామని అన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ప్రభుత్వ పెద్దలు, అధికారుల సహకారంతో త్వరలోనే జర్నలిస్టుల సొంతింటి కలను పూర్తిస్థాయిలో సహకారం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీయూడబ్ల్యూజే లో చేరిన పలువురు జర్నలిస్టులు..
అనంతరం పలువురు శేరిలిం గంపల్లి సీనియర్ జర్నలిస్టులు (Gampally senior journalists) టిఎస్ యుడబ్ల్యూజే నుండి టియు డబ్ల్యూజేలో చేరారు. రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో టీఎస్ యు డబ్ల్యూజే ప్రెస్ క్లబ్ (TSU WJ Press Club) మాజీ అధ్య క్షుడు కే శ్రీనివాస్ గౌడ్, మాజీ ప్రధా న కార్యదర్శి అశోక్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మల్లేష్ తదితరులు టీయూడ బ్ల్యూజేలో చేరారు. ఈ సందర్భంగా కొత్తగా యూనియన్ లో చేరిన వారిని శాలువాలతో ఆహ్వానిం చారు. ఈ కార్యక్రమంలో శేరిలిం గంపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, టెంజు సలహా దారుడు రవీందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్, కోశాధికారి లక్ష్మీనారా యణ, ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్, సురేష్, ఖదీర్, రాజు, టెంజు అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె. కిషోర్ కుమా ర్, ప్రధాన సలహాదారులు ఎంఎం బేగ్, మారుతి కుమార్, సహాయ కార్యదర్శులు ఎల్లేష్, రాజేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, అనిల్ కుమార్, రాజేష్ లతో పాటు జర్నలిస్టులు సుధాకర్, సతిష్ కుమార్, కృష్ణ సాగర్,రాజు సాగర్, కృష్ణ, ప్రభాకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, రామస్వామి, సత్యం, ఆనంద్ గౌడ్, శర్ఫుద్దీన్, శశిధర్ శాస్త్రి, సురేష్, మహేష్, శివ కుమార్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్, కృష్ణ, శైల జ, మల్లేష్ ,మూర్తి, దేవేందర్, కృష్ణమా చారి తదితరులు పాల్గొ న్నారు.