Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: రియల్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండదండ

–పాలనాపరమైన అభివృద్ధి ఇకపై సులభతరం
–ఇప్పటికే అనుమతులు పొందినో ళ్ళకు ఆందోళన అవసరం లేదు
–క్రేడాయి, ట్రెడాలు ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసుకోవాలి
–సమస్యల పరిష్కారానికి కమిటీ తో చర్చలకు ప్రభుత్వం సిద్దం
–అంతర్జాతీయ స్థాయిలో హైదరా బాద్ అభివృద్ధి
–అభివృద్ధిలో రియల్టర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కావాలి
–రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో నగరాభివృద్ధికి శ్రీకారం
–రీజినల్ రింగ్ రోడ్ తో పాటు కనె క్టివిటీ రోడ్ల నిర్మాణానికి నిర్ణయం
–ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో వృత్తి నైపు ణ్య విశ్వవిద్యాలయం
–14 వ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంతో పాటు నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర నీటిపా రుదల, పౌర సరఫరాల శాఖామం త్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్ప ష్టం చేశారు. ఈ విషయంలో ఎవ రూ అధైర్యానికి లోనూ కావొద్దని ఆయన హితవు పలికారు. శుక్రవారం ఉదయం హైటెక్స్ లో ఆయన 14 వ ప్రాపర్టీ షో ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ఉన్న వారితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఎన్. ఓ .సి లతో పాటు పాలనా పరమైన అనుమతులు సులభతరం చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అనుమతులు పొందిన వారు అధైర్యపడొద్దని ఆయన ఉపదేశించారు.

క్రేడాయ్, ట్రెడా (Credai, Treda)లు సంయుక్తంగా ఒక కమిటీని నియమించుకోవాలని ఆయన సూచించారు. తద్వారా మీరు ఎదుర్కొంటున్న సనస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంతో పాటు నిర్మాణాదారులు ఏ సమయంలో ఏ విషయంలో నైనా ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు ఈ కమిటీ దోహదపడుతుందన్నారు.అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు తరలి రావడమే అందుకు అద్దం పడుతుందన్నారు. అటువంటి అభివృద్ధి లో రియల్టర్లు, బిల్డర్లు (Realtors, Builders)భాగస్వామ్యం కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పిలుపునిచ్చారు.

అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకీ (Congress party)స్పష్టత ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కి రాష్ట్ర బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే నని ఆయన చెప్పారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిందే తడవుగా రీజనల్ రింగ్ రోడ్ తో పాటు కనెక్టివిటీ రహదారుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టమన్నారు. మెట్రో విస్తరణ వేగవంతం చేయడంతో పాటు ట్రాఫిక్ ను క్రమ బద్దీకరించేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయన్నారు. త్రాగునీటి సామర్ధ్యాన్ని పెంచే అంశం పరిశీలనలో ఉందన్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్యత విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందన్నారు. అదే విదంగా అంతర్జాతీయ స్థాయిలో క్రిడా విశ్వవిద్యాలయం నెల కోల్పుతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తద్వారా రియల్ ఎస్టేట్ రంగంతో పాటు నిర్మాణాదారులకు ఈ అభివృద్ధి ఉపకరిస్తుందని,అదే సమయంలో రియల్టర్లు మరియు బిల్డర్లు అభివృద్ధిలో భాగస్వామ్యం అయి ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పిలుపునిచ్చారు.