Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vemula Rohit case: తెర మీదకు ‘వేముల రోహిత్ ‘

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ తెరమీదకొచ్చింది. విషయం మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రోహిత్‌ వేముల ఆత్మహ త్యకు ఎవరూ కారణం కాదని, అత ను దళితుడే కాదని పోలీసులు నివేదిక ఇవ్వడంతో హెచ్ సి యు లో ఉత్కంఠ వాతావరణం నెల కొంది.

నాడు జాతీయ స్ధాయిలో సంచలనం సృష్టించిన కేసు
మూసేసిన కేసు ముడి విప్పేం దుకు తెలంగాణ డిజిపి నిర్ణయం
రోహిత్ తల్లి సీఎం రేవంత్ ను కలవడంతో కీలక పరిణామం
లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ రంగు పులుముకున్న వైనం

ప్రజాదీవెన, హైదరాబాద్: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన రోహిత్ వేముల (Vemula Rohit) ఆత్మహత్య కేసు మళ్లీ తెరమీదకొచ్చింది. విషయం మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రోహిత్‌ వేముల ఆత్మహ త్యకు ఎవరూ కారణం కాదని, అత ను దళితుడే కాదని పోలీసులు నివేదిక ఇవ్వడంతో హెచ్ సి యు లో ఉత్కంఠ వాతావరణం నెల కొంది. ఏది ఏమైనాప్పటికీ రోహిత్‌ వేముల ఆత్మహత్యపై మరోసారి తెరమీదకి రావడంతో రాజకీయ రంగు కులుముకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రోహిత్ వేముల కేసును రీఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయం తీసుకొ ని సదరు కేసును పున ర్విచారణ చేపట్టనున్నట్లు ప్రక టించడం గమ నార్హం.

రోహిత్ కేసు ను మూసివే సినట్లు పోలీసులు సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడమే స్పందించడమే తరువాయిగా పునః ప్రారంభించా లని ఆదేశాలు వెలువడడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యం లోనే రోహిత్ వేముల తల్లి రాధిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోహిత్ కేసును క్లోజ్ చేశారని దీని పై సమగ్రంగా దర్యాప్తు చేయాలని రోహిత్ తల్లి రాధిక సీఎంను కోరా రు. ఆ మేరకు స్పందించిన రేవంత్ రెడ్డి కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ కూడా ఇచ్చారు. నా కొడుకు దళితుడే కాదం టా… సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం రోహిత్ తల్లి రాధిక మీడియాతో మాట్లాడారు. రెండు నెలల క్రితమే కేసు క్లోజ్‌ చేశారంటూ పేర్కొన్నారు. తన కొడుకు దళితుడే కాదంట అంటూ ప్రశ్నించారు.

తన బిడ్డ దళితుడని కాకినాడ కలెక్టర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. రెండు నెలల క్రితమే కేసు క్లోజ్‌ చేశారని పోలీసుల దర్యాప్తు సరిగా లేదని, తమకు న్యాయం చేస్తామని సీఎం చెప్పారన్నారని తెలిపారు. రోహిత్‌ది కచ్చితంగా హత్యే తన కొడుకుని చంపిన వారందరూ జైలుకు వెళ్లాలని ఆకాంక్షించారు. సోషల్‌ బాయికాట్‌పై దర్యాప్తు చేయాలని రాధిక డిమాండ్ చేశారు. హెచ్సీయూలో ఆందోళనలు పునరావృతం… దాదాపు 8 సంవత్సరాల తర్వాత రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకొచ్చింది. 2016 జనవరి 17న హెచ్ సి యులో రోహిత్‌ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. అప్పటి హెచ్ సి యు వీసీతో పాటు బీజేపీ నేతల వేధింపుల కారణం గానే రోహిత్‌ ఆత్మహత్య చేసుకు న్నాడనేది అప్పటి ప్రధాన ఆరో పణగా నిలిచింది.

రోహిత్‌ సూసై డ్‌పై ఆనాడు పెనుదుమారం రేగిన విషయం కూడా విదితమే.  అప్పట్లో రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్‌, వామపక్ష నేతలు హెచ్ సి యు కి రావడంతో రోహిత్‌ ఆత్మహత్య సంఘటన జా తీయస్థాయిలో చర్చనీయాంశo కాగా జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో యావత్ దేశo హైదరాబాద్‌ వైపే చూసింది. దేశవ్యాప్తంగా పెద్దఎ త్తున ఆందోళనలు జరిగగా రోహిత్‌ కేసును తాజాగా మూసివేయడం తో హెచ్ సి యు లో మళ్లీ ఆందో ళనలు ఆరంభమయ్యాయి. తాజాగా రోహిత్ కేసు మూసివేయడం మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం పునః ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో హెచ్సీయూలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

Vemula Rohit case reopen