Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

3 Wheeled Electric Scooter: మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషల్ ఇదే

3 Wheeled Electric Scooter: గడిచిన కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు బాగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల పూర్తి పర్యావరణ హితం కావడంతో ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తున్నాయికానున్న అందరు ఇష్టం చూపిస్తున్నారు. అంతే కాకుండా నిర్వహణ వ్యయం చాలా తక్కువ ఉండటంతో వినియోగదారులు కూడా వాటివైపు మొగ్గుచూపుతున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ద్విచక్రవాహనాలుగానే మర్కెట్స్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ తొలిసారి మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ (3 Wheeled Electric Scooter) మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఓ వీడియో ఆన్ లైన్లో వైరల్ గా మారింది. ప్రత్యేకించి వృద్ధుల కోసం రూపొందించిన ఈ స్కూటర్ అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు పీఈవీ ఫాంటమ్( Pev Phantom). ఇది మూడు చక్రాలతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కేలా సన్స్ మూడు చక్రాల పీఈవీ ఫాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్కు (3 Wheeled Electric Scooter) సంబంధించిన వీడియోను మిస్టర్ ఆటో అనే యూ ట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. దీనిలో మూడు చక్రాలతో కూడిన స్కూటర్ ఉంటుంది. ముందు వైపు రెండు చక్రాల స్కూటర్ మాదిరిగానే ఉన్నా.. వెనుకవైపు పెద్ద సీటుతో కారు మాదిగా ఉంటుంది. దీంతో పాటు బండి నిలబడేందుకు వీలుగా రెండు చక్రాలు అటొకటి.. ఇటొకటి ఉంటుంది. ఈ స్కూటర్ ప్రస్తుతం రూ. 88,000లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. ఈ స్కూటర్ డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్‌తో (With the headlight setup) మార్కెట్లో అందుబాటులో ఉంది .

ఈ త్రీ వీలర్ స్కూటర్ రెండు ప్రొజెక్టర్ లైట్ పాడ్‌లను, వృత్తాకార హెడ్‌లైట్ హౌసింగ్‌లో (Projector light pods, in a circular headlight housing)పగటిపూట రన్నింగ్ ఎల్ఈడీలను కూడా పొందుతుంది. హాలోజన్ ఆధారిత సిగ్నల్ లైట్స్ కూడా అమర్చారు. ఇది 190ఎంఎం డిస్క్ బ్రేక్‌తో ముందు భాగంలో 10-అంగుళాల సిల్వర్ అల్లాయ్ వీల్‌ను కలిగిఉంది. హ్యాండిల్‌బార్‌కు రెండు వైపులా మంచి నాణ్యత గల స్విచ్‌లతో అమర్చారు. కుడి వైపు స్విచ్ లు హెడ్‌లైట్లు, డ్రైవింగ్ మోడ్‌లను నియంత్రిస్తాయి. ఇక స్కూటర్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను ఉంటుంది. వెనుక భాగంలో స్ప్రింగ్‌లను పొందుతుంది. స్కూటర్ వెనుక భాగంలో పెద్ద పరిమాణంలో సీటుకూడా ఉండడం విశేషం. ఇది సర్దుబాటు చేయగల హ్యాండ్ రెస్ట్‌లను కూడా పొందుతుంది.

ఈ పీఈవీ ఫాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (PEV Phantom Electric Scooter)60వోల్ట్స్ 32ఏహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీతో అందుబాటులో ఉంది . అదనపు ఖర్చుతో లిథియం-అయాన్ బ్యాటరీకి అప్‌గ్రేడ్‌ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 50-60 కి.మీ. వరుకు ప్రయాణం కూడా చేయవచ్చు. ఇది రెండు వెనుక చక్రాలకు శక్తినిచ్చే 1000వాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో (With 1000 watt electric motor) మార్కెట్లో అందుబాటులో ఉంది.