Air Passengers: సాధారణంగా పండుగల వస్తే చాలు అన్ని రంగాల్లోనూ ఆఫర్లు భారీ స్థాయిలో ప్రకటిస్తూ ఉంటారు. కానీ రవాణా రంగానికి వచ్చే సరికి పండుగల సమయాల్లోనే ధరలు మాత్రం భారీగా పెరుగుతుంటాయి. బస్సులు, రైళ్లలో స్పెషల్ పేరిట డబుల్ రేట్లు వసూలు చేస్తూ ఉండడం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇక విమాన ప్రయాణానికి అక్కడ కూడా అంతే.. డిమాండ్ పెరిగితే టికెట్లు కూడా పెరుగుతుంటాయి. కానీ ఈ దీపావళికి (deewali) మాత్రం విమాన ప్రయాణికులు ఒక శుభ వార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో విమాన ప్రయాణాలపై టికెట్ల రేట్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా దేశీయ రూట్లలో సగటు విమాన చార్జీలు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 20 నుంచి 25శాతం తగ్గినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోడానికి మక్కువ చూపిస్తారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల విషయానికి వస్తే..
సాధారణంగా విమానయాన సంస్థలు డైనమిక్ ప్రైసింగ్ అల్గారిథమ్‌లను వాడుతారు. వీటికి డిమాండ్ పెరిగేకొద్దీ ఛార్జీలను కూడా పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా దీపావళి వంటి సెలవుల సమయంలో ఆటో మేటిక్ గా ధరలు పెరుగుతాయి. కానీ అందుకు విరుద్ధంగా దీపావళికి తక్కువ చార్జీలు ఉండటం అందరికీ షాక్ లాగా ఉంది. విమాన టిక్కెట్ ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా కెపాసిటీ పెరగడం, ఇటీవల చమురు ధరలు తగ్గడం వంటి వాటి ప్రభావమేనని అంచనా. పోయిన ఏడాది పరిమిత సామర్థ్యం కారణంగా దీపావళి (deewali) సమయంలో విమాన ఛార్జీలు పెరిగాయి. ప్రధానంగా గో ఫస్ట్ ఎయిర్‌లైన్ సస్పెన్షన్ కారణంగా ఇది జరిగింది. ఈ సంవత్సరం కొంత ఉపశమనం ఉంది.. అదనపు సామర్థ్యం అందుబాటులో కి వచ్చింది. ఇది అక్టోబర్ చివరి వారంలో కీలక మార్గాలలో సగటు విమాన ఛార్జీలలో (flight charges) 20-25 శాతం తగ్గుదలకు దారితీసిందని వివరిస్తున్నారు. అలాగే చమురు ధరలలో తగ్గుదల కూడా ఓ కారణంగా వివరిస్తున్నారు. ఈ సంవత్సరం 15 శాతం తగ్గడం దీనికి దోహద పడి ఉండవచ్చని అంచనా . ఫలితంగా పండుగ సీజన్‌లో ప్రయాణికులకు మరింత సరసమైన ధరలకు విమానాల్లో ప్రయాణించే అవకాశంకూడా ఎక్కువ..
ధరల వ్యత్యాసం ఎలా ఉంది అంటే .. విమానాల్లో 30 రోజుల ఏపీడీ (అడ్వాన్స్డ్ పర్చేస్ డేట్) ప్రాతిపదికన వన్-వే సగటు ఛార్జీలు ఉంటాయి. దీపావళి సమయంలో గతేడాదికి ఇప్పటికీ అంటే 2023 నవంబర్ 10 నుంచి 16, ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకూ ధరల తేడాను గమనిస్తే..
1. బెంగళూరు-కోల్‌కతా విమానానికి సగటు విమాన చార్జీలు గరిష్టంగా 38 శాతం క్షీణించాయి. గత ఏడాది రూ.10,195 నుంచి ఈ ఏడాది రూ.6,319కి తగ్గింది.
2. చెన్నై-కోల్‌కతా మార్గంలో టికెట్ ధర రూ.8,725 నుంచి రూ.5,604కి అంటే 36 శాతం తగ్గింది.
3. ముంబై-ఢిల్లీ విమానాల సగటు విమాన చార్జీలు రూ.8,788 నుంచి రూ.5,762కి అంటే 34 శాతం తగ్గింది.
4. ఢిల్లీ-ఉదయ్‌పూర్ రూట్‌లో టికెట్ ధరలు 34 శాతం తగ్గి, రూ.11,296 నుంచి రూ.7,469కి వచ్చాయి.
5. ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీ, ఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో 32 శాతం క్షీణత కనిపిస్తోంది.
ఏది ఏమైనా ఇది విమాన ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి..