Ayushman Bharat Health Card: ప్రస్తుత రోజులల్లో చాల మంది హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందు కోసం మన దేశంలోని ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని అందించడానికి ఆయుష్మాన్ భారత్ యోజన అందుబాటులో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కీమ్‌కి సంబంధించి పెద్ద అప్‌డేట్ ప్రకటించింది. ఈ స్కీమ్‌ను పొందుతున్నప్పుడు ప్రజలు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా, వారి పని సులభం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇప్పుడు గూగుల్ సహకారంతో ఒక వ్యవస్థను సిద్ధం చేస్తోంది. దీని వలన ప్రజలు గూగుల్‌లోనే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్‌ను పొందవచ్చు జన్ ఆరోగ్య యోజన (Jan Arogya Yojana (AB PM – JAY) ప్రయోజనాలను పొందేందుకు ప్రజల ఆరోగ్య కార్డులు పొందవచ్చు. త్వరలో ఈ హెల్త్ కార్డ్‌లు Google Walletలో అందుబాటులోకి రాబోతున్నట్టు సమాచారం. దీని ద్వారా సామాన్యులకు అనేక ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు
హెల్త్ కార్డ్ 2025 నుండి గూగుల్ వాలెట్‌లో ఎలా పొందాలంటే… ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ (ABHA ID) 2025 నుండి గూగుల్ వాలెట్‌లో అందుబాటులో ఉంటుందని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలియ చేసింది . ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలను ప్రజలకు డిజిటల్‌గా అందించేందుకు రూపొందించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM)లో ఇది ఒక భాగం. ఈ మిషన్‌ను పర్యవేక్షిస్తున్న నేషనల్ హెల్త్ అథారిటీ గూగుల్‌తో జత కట్టినట్టు సమాచాం. దీని కారణంగా ఈ పథకానికి సంబంధించిన హెల్త్ కార్డ్‌లు గూగుల్ వాలెట్‌లో డిజిటల్ ఫార్మాట్‌లో మాత్రమే ప్రజలకు అందుబాటులో రాబోతుంది. గూగుల్ వాలెట్‌లో అందుబాటులో ఉన్న ABHA ID కార్డ్‌తో ప్రజలు ల్యాబ్ పరీక్ష నివేదికలు, మందుల స్లిప్‌ల వంటి వారి వైద్య రికార్డులను దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలలో చూపించవచ్చని తెలియచేసింది. ఇది ఒక పరంగా అందరికి శుభా వార్త అనే చెప్పాలి