Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bank holidays for September 2024: సెప్టెంబర్‌లో 14 రోజులు బ్యాంకులు బంద్‌ ఎందుకంటే?

Bank holidays for September 2024: ఆర్బీఐ ప్రతి నెల కూడా బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేయడం అందరికి తెలిసిన విషయమే. అందుకు తగట్టు బ్యాంకు వినియోగదారులు (Bank customers) ఈ సెలవులను గమనించి తమతమ బ్యాంకు పనులను చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. లేకపోతె మీ సమయం వృధా కావడంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశలు ఎక్కువ.. ఇక ఆర్బీఐ క్యాలెండర్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ (September )నెలలో మొత్తం 14 సెలవులు ఉండబోతున్నాయి. ఇందులో శని, ఆదివారాలు సెలవులు ఉన్నాయి. వినాయక చతుర్థి, ఈద్ మిలాద్ పండుగలు కూడా సెలవు జాబితాలో చేర్చారు. కేరళలో జరుపుకొనే ఓనం, తిరువణం పండుగలు కూడా ఉన్నాయ్. బదులుగా నారాయణగురు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 18, 21 తేదీలలో కేరళలో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా సెప్టెంబరు 14 నుంచి 16 వరకు బ్యాంకులకు మూడు రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఇందులో 16న ఈద్ మిలాద్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు రాజస్థాన్‌లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. సిక్కింలో 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి.ఈద్ మిలాద్ కాకుండా శని, ఆదివారాలు మాత్రమే సెలవులు. కర్ణాటకలో మొత్తం ఎనిమిది సెలవులు ఉన్నాయి.

సెప్టెంబర్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా (List of Bank Holidays): సెప్టెంబర్ 5, గురువారం: శ్రీమంత శంకరదేవ తిథి (అస్సాంలో సెలవు), సెప్టెంబర్ 7, శనివారం: వినాయక చతుర్థి సెప్టెంబరు 8: ఆదివారం సెలవు (ఒడిషాలో నౌకై పండుగ), సెప్టెంబర్ 13, శుక్రవారం: రామ్‌దేవ్ జయంతి, తేజ దశమి (రాజస్థాన్‌లో సెలవు), సెప్టెంబర్ 14: రెండవ శనివారం (కేరళలో ఓనం), సెప్టెంబర్ 15: ఆదివారం సెలవు (కేరళలోని తిరువోణం), సెప్టెంబర్ 16, సోమవారం: ఈద్ మిలాద్, సెప్టెంబర్ 17, మంగళవారం: ఇంద్ర జాత్ర (సిక్కింలో సెలవు), సెప్టెంబర్ 18, బుధవారం: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో సెలవు) సెప్టెంబర్ 21, శనివారం: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో సెలవు), సెప్టెంబర్ 22: ఆదివారం సెలవు, సెప్టెంబర్ 23, సోమవారం: బలిదాన్ డే (హర్యానాలో సెలవు) సెప్టెంబర్ 28: నాల్గవ శనివారం, సెప్టెంబర్ 29: ఆదివారం సెలవు ఇలా పైన తెలిపిన వాటి రోజులు బ్యాంకు పనులు పెట్టుకోకుండా ఉండడమే మంచిది.

అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకటే కాదు . ఆయా రాష్ట్రాల (states) పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని వినియోగదారులు గమనించండి. ఇక తెలుగు రాష్ట్రాలకు ఉండే సెలవులను బట్టి మన వాళ్ళు బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోవడం ఉత్తమం.