Best Recharge Plans: తాజాగా అన్ని టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్స్ (Recharge Plans)పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని కంపెనీలు అయితే ఏకంగా 10 నుంచి 25 శాతం వరకు ధరలను కూడా పెంచాయి. ఈ రీఛార్జ్ ప్లాన్స్ పెంచడంతో మొబైల్ ఫోన్ (Mobile phone) ఉపయోగిస్తున్న వారిపై భారీగా బాగా భారం పడింది అనే చెప్పాలి. ఇక జియో మొదలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ వరకు అన్ని సంస్థలు రీఛార్జ్ ప్లాన్స్ పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ (Recharge Plans) అన్ని కూడా జులై 4వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇదిలా ఉంటే ధరలు పెరిగిన తర్వాత కూడా ప్రముఖ టెలికాం దిగ్గజం జియో (jio) కొన్ని మంచి ప్లాన్స్‌ను కూడా యూజర్స్ కోసం అందుబాటులోకి ఉంచింది. ఇతర కంపెనీలతో పోల్చితే జియో అందిస్తున్న కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..
జియో (jio)సంస్థ వారు అందిస్తున్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌లో రూ. 249 ఒకటి. ఈ ప్లాన్‌తో రోజుకు 1 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. అయితే ఇతర సంస్థలతో పోల్చితే జియోలోనే ఈ ప్లాన్ తక్కువ ధరకు యూజర్స్ కు లభిస్తుంది. అదే రూ. 299తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ (Unlimited calls)లభిస్తాయి. ఇదే బెనిఫిట్స్‌తో ఇతర కంపెనీల్లో రూ. 349 ప్లాన్ అమల్లోకి రాబోతున్నాయి.
ఇక జియో అందిస్తున్న మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్‌లో (Best Recharge Plans) రూ. 349 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా తో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ (Unlimited calls) చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్‌తో ఇతర టెలికాం సంస్థల్లో అదనంగా రూ. 50 పే చేయాలి. ఇక మూడు నెలల ప్లాన్ కోసం చూస్తున్న యూజర్స్ కోసం రూ. 479 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో యూజర్లకు 6 జీబీ డేటా తో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ (Unlimited calls) పొందొచ్చు. ఇదే ఫెసిలిటీస్ ఇతర టెలికాం సంస్థల్లో రూ. 509 వరకు పే చేయాలి. ఇక సంవత్సర ప్లాన్ విషయానికొస్తే.. రూ. 1899 ప్లాన్‌తో రీఛార్జ్ (recharge)చేసుకుంటే ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ తో పాటు 24 జీబీ డేటా లభిస్తుంది. ఇదే ప్లాన్ ఇతర సంస్థల్లో అయితే ఏకంగా 5 శాతం ఎక్కువగా పే చేయాలి.. ఇతర కంపెనీలతో పోలిస్తే జియో అందించే ఈ బెస్ట్ ప్లాన్స్ అని కొందరు యూజర్స్ వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.