Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BSNL :బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు బంపర్ ఆఫర్

BSNL : ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ (INTERNET) వినోయోగం సర్వసాధారణం అయ్యేంది. దీనితో చాల మంది వారి ఇంట్లో కూడా కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని ఉపయోగిస్తున్నారు, ఇందుకోసం ముందుగా ఏ కంపెనీ తక్కువ ధరకు బెస్ట్ ప్లాన్‌ని అందిస్తుందో తెలుసుకోవడం మంచిది. జియో ఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ (Jio Fiber, Airtel Xstream Broadband) ప్లాన్‌లు ఇలా మార్కెట్లో బాగా ప్రాచుర్యం కూడా పొందాయి. ఇది ఇలా ఉండ మరో వైపు ఈ రెండు కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా పక్క ప్లాన్ సిద్ధం చేసింది. యూజర్స్ ను బాగా ఆకర్షించడానికి కంపెనీలు మంచి ఆఫర్‌లతో ముందుకు వస్తాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ BSNL Bharat Fiber కూడా ప్రజల కోసం ఒక మంచి ఆఫర్‌ను (OFFER) మొదలు పెట్టింది. దీనితో Reliance Jio, Airtel కంపెనీల టెన్షన్‌ను పెంచుతుంది. ఈ ఆఫర్ ఏమిటి ? మీరు ఈ ఆఫర్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చ అనే వివరాలు మనం ఇప్పుడు చూద్దాం..

తాజాగా BSNL అధికారి నుండి ఒక పోస్ట్ సోషల్ మీడియా లో (SOCIAL MEDIA) పోస్ట్ చేశారు . అందులో రూ.499 ప్లాన్ మొదటి 3 నెలలకు రూ.399కి అందించబడుతోంది. మూడు నెలల తర్వాత మనం మల్లి ప్లాన్ కోసం రూ.499 చెల్లించాలి. అంటే మూడు నెలల్లో రూ. 300 ఆదా చేసే అవకాశం ఉంది. అలాగే 1 నెల ఉచిత సేవ కూడా ఉంది. ఈ డీల్ చాలా ప్రయోజనకరంగా ఉండడంతో పాటు కస్టమర్స్ ను కూడా బాగా అక్కటుకుంటుంది . అలాగే వినియోగదారులు 60Mbps వేగంతో 3300GB డేటాను పొందుతారు. కానీ 3300 GB డేటాను వినియోగించిన తర్వాత వేగం 4Mbpsకి తగ్గుతుంది. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధరలో 18 శాతం GST కూడా విడిగా వసూలు చేస్తారని తెలియచేసింది.

ప్లాన్(plan) వివలరాలు ఇలా …రూ. 499 ఈ ప్లాన్‌లో వినియోగదారులు 60Mbps వేగంతో 3300 GB డేటా, అపరిమిత డేటా డౌన్‌లోడ్, ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్‌తో సహా ప్రయోజనం పొందుతారు.

JioFibre 399 ప్లాన్(plan) వివరాలు:
Reliance Jio ఈ ప్లాన్‌లో (plan)మీరు అపరిమిత హై స్పీడ్ డేటా, ఉచిత అపరిమిత కాలింగ్, 30Mbps వేగంతో 30 రోజుల చెల్లుబాటు ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌లో FUP పరిమితి 3300 GB కూడా ఉండడం విశేషం.

Airtel 499 ప్లాన్ (plan)వివరాలు:
ఈ ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్‌లో (plan)40Mbps వేగంతో అపరిమిత డేటా ఉంటుంది. అయితే మీరు ఈ ప్లాన్‌ను 3300 GB FUP పరిమితితో కూడా పొందుతారు. ఇది కాకుండా, ఏదైనా నెట్‌వర్క్‌లో ఉచిత అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంటుంది. మూడు ప్లాన్‌లలోని ధరలతో పాటు మీరు 18 శాతం GST కూడా పే చేయాల్సి ఉంటుంది.

ఇందులో ఆ ప్లాన్ (plan) బెస్ట్ యో మనకి ఇలాగె అర్థం అవుతుంది. సరియైన ప్లాన్ ను ఎంచుకొని బ్రాడ్‌బ్యాండ్ ప్రయోజనాలను పొందండి.