Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BSNL Offer: బీఎస్ఎన్ఎల్ యూజర్లకి అదిరిపోయే ఫెస్టివల్ ఆఫర్..

BSNL Offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) వినియోగదారులకు అత్యంత చవకైన ధరలకే చాలా ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుంది ఈ కంపెనీ ఓన్లీ మొబైల్ ఫోన్ యూజర్లకు మాత్రమే కాకుండా ఫైబర్ ఇంటర్నెట్ యూజర్లకు కూడా అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ భారత్ ఫైబర్ (Bharat Fiber)కి సంబంధించి ఒక ప్రత్యేక ఆఫర్‌ని ప్రకటించింది. ‘ఫెస్టివల్ ధమాకా (Festival Dhamaka Offer)’ పేరిట తీసుకొచ్చిన ఈ ఆఫర్ భారత్ ఫైబర్ ఇంటర్నెట్ వాడే వాళ్లందరికీ వర్తిస్తుంది.

ఆఫర్ ఏంటంటే సాధారణంగా నెలకు రూ.499 చెల్లించాల్సిన ఇంటర్నెట్ ప్లాన్‌ని ఇప్పుడు రూ.399కే మూడు నెలల పాటు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 60 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ పొందవచ్చు. మూడు నెలల్లో మొత్తం 3300 GB వరకు డేటా వాడవచ్చు. కొత్తగా భారత్ ఫైబర్ కనెక్షన్ (Bharat fibre connection) తీసుకునే వాళ్లకు మొదటి నెల ఫ్రీ.

ఈ ఆఫర్ కొంతకాలం మాత్రమే ఉంటుంది కాబట్టి త్వరపడాలి. బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ ప్రారంభించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కొత్తగా కనెక్షన్ తీసుకునే వాళ్లకీ, ఇప్పటికే కనెక్షన్ ఉన్న వాళ్లకీ కూడా చాలా ఆఫర్లు ఇస్తున్నారు. రూ.500 కంటే ఎక్కువ రీచార్జ్ చేస్తే, అదనంగా 24GB డేటా ఉచితంగా లభిస్తుంది. అంటే, మీరు ఎంత ఎక్కువ రీచార్జ్ చేస్తే అంత ఎక్కువ డేటా ఉచితంగా వస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ తమ కస్టమర్లకు మంచి సర్వీసు ఇవ్వాలని కోరుకుంటుంది. అందుకే ఈ ఆఫర్లు (Affordable Plans) ఇస్తున్నారు. తక్కువ ధరకు మంచి ఇంటర్నెట్ వేగం అందించాలని కంపెనీ ఆశిస్తోంది.

మీరు కూడా బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ వాడుతున్నట్లయితే వెంటనే పైన చెప్పిన ఇంటర్నెట్ ప్లాన్ (Data Offer) తీసుకొని చాలా లాభపడవచ్చు. ఒకవేళ కొత్తవారైతే ఈ ఫైబర్ నెట్వర్క్ తీసుకొని చాలా తక్కువ ధరకు మూడు నెలలపాటు చాలా ఇంటర్నెట్ జీబీ పొందవచ్చు. ఎయిర్టెల్ వంటి ఇతర కంపెనీలు కూడా ఫైబర్ ఇంటర్నెట్ అందిస్తున్నాయి కానీ అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి.