Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BSNL: కేవలం రూ.107కే 35 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్ ఇదే

BSNL: నిజానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ దాని చౌకైన ప్లాన్‌లకు కస్టమర్‌లలో బాగా ప్రసిద్ధి చెందింది. అలాగే కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 20, 28, 30 రోజులకు బదులుగా 35 రోజుల చెల్లుబాటును అందించే రూ.107 ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. అలాగే 35 రోజుల వాలిడిటీతో వచ్చే బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.

BSNL రూ. 107 రీఛార్జ్ ప్లాన్ 35 రోజుల చెల్లుబాటును కలిగి ఉండడంతో కస్టమర్లకు 3GB డేటా లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఈ ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌లలో ఒకటి. డేటా (data)పరిమితి ముగిసిన తర్వాత దాని వేగ పరిమితి 40kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ ఒక నెల కంటే ఎక్కువ కాలపరిమితిని కూడా ఇస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్ సేవను పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో 35 రోజుల పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్ సేవ కూడా అందుబాటులోకి తీసుకోని రాబోతుంది ఉంటుంది. అలాగే సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి చౌక సిమ్ కోసం చూస్తున్న కస్టమర్‌లకు ఈ ప్లాన్ బాగా సహాయ పడుతుంది.

అలాగే తక్కువ ఖర్చుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచే ప్లాన్ కోసం చూస్తున్న కస్టమర్స్ (customers)కోసం ఈ ప్లాన్ బాగా సహాయ పడుతుంది. ఆలాగే ఈ ప్లాన్‌లో 200 నిమిషాల కాలింగ్ ఉచితంగా ఉండడంతో పాటు , మీ SIMని 35 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంచుతుంది. అలాగే తక్కువ డేటాతో చౌక ప్లాన్ (plan)కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకుబెస్ట్ అనే చెప్పాలి.

అలాగే ఎయిర్‌టెల్ 35 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.289. ఎయిర్‌టెల్ (aitel) ఈ రూ. 289 ప్లాన్ 35 రోజుల చెల్లుబాటుతో ఎస్‌ఎంఎస్‌, అపరిమిత కాలింగ్ వంటి అనేక ప్రయోజనాలను కస్టమర్స్ కోసం ప్రవేశ పెడుతుంది. అలాగే ఈ ప్లాన్‌తో కంపెనీ 300 ఉచిత SMSలను అందిస్తుంది. వినియోగదారులు 4GB డేటాను కూడా పొందవచ్చు.