Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bullet Bike lovers: బుల్లెట్ బైక్ ప్రియులకు శుభ వార్త..?

Bullet Bike lovers:మన భారత దేశంలో బుల్లెట్టు బండికి (Bullet bike) ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాలిసిన అవస్సరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా బులెట్ బైక్ ను (Bullet bike) నడపడానికి ఎంతో ఇష్ట పడతారు. ఇక సినిమాాలలో ఈ బండికి ప్రత్యేకంగా పాటలే ఉన్నాయి అంటే నమ్మండి. ఇక రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ తన ప్రసిద్ద మోడళ్లకు అప్ గ్రేడ్ వెర్షన్లు తయారు చేేసేందుకు ప్రణాళిక కూడా రూపొందించింది. ఇందులో భాగంగా మొదటగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ను అప్ డేట్ చేయగా. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) నుంచి ఇటీవల గెరిల్లా 450 మార్కెట్ లోకి కూడా విడుదలైంది. ప్రస్తతం అవుట్‌ గోయింగ్ మోటార్‌సైకిల్‌ను అప్‌డేట్ చేయడం మొదలు పెట్టారు కంపెనీ వారు.

ఇక క్లాసిక్ 350 గురించి విశ్వసనీయ సమాచారం మేరకు.. కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను (Cosmetic upgrade) ఉండవచ్చు. ఇతర మోటార్‌ సైకిళ్లలో ఉపయోగించిన ఎల్ ఈడీ హెడ్‌ల్యాంప్‌, సిగ్నల్స్, టెయిల్ ల్యాంప్‌లు (LED headlamp, signals, tail lamps)ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొత్త రంగులతో బండిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు అన్నట్టు సమాచారం.

ఇక అలాగే రాయల్ ఎన్‌ఫైల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)బుల్లెట్ లో 349 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు కూడా చేసారు. ఇది 20.2 బీహెచ్ పీ శక్తి, 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను 4000 ఆర్ పీఎమ్ వద్ద పునరుద్ధరిస్తుంది. ఈ పవర్ యూనిట్ 5 స్పీడ్ యూనిట్‌కు కూడా జత చేయడం జరిగింది.

అలాగే రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.25 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. దీనిలో ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్లు, ఎకో ఇండికేటర్, సర్వీస్ ఇండికేటర్ (Fuel gauge, trip meters, eco indicator, service indicator) కోసం డిజిటల్ రీడౌట్‌తో అనలాగ్ స్పీడోమీటర్‌ ఏర్పాటు కూడా చేసారు . అంతేకాకుండా మొబైల్ ఫోన్‌లను చార్జింగ్ చేసుకోవడానికి యూఎస్ బీ పోర్ట్‌ను కూడా ఉండడం విశేషం. ఇక అప్‌డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వెర్షన్‌ను (new version) ఆగస్టు 12 న దేశంలో విడుదల చేయడానికి ప్రణాళిక చేసినట్లు సమాచారం. ఈ కొత్త వెర్షన్‌ కు ఎలాంటి ఆధారణా వస్తుందో చూడాలి మరి.