Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bumper Offer: బంపర్ ఆఫర్: రూ.1,947కే విమాన ప్రయాణం

Bumper Offer: భారతదేశం అంతటా ఆగస్టు 15న 77వ స్వాతంత్ర్య దినోత్సవం (independence day) జరుపుకోబోతోంది. దీనితో భారతదేశం అంతటా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టరు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో రూ.1,947కి విమాన టిక్కెట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తుంది. ఈ అద్భుతమైన ఆఫర్‌ను ఎయిర్ ఇండియా పొందాలనుకునే వారు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది.

అసలు ఫ్రీడమ్ సేల్ (Freedom Sale) ప్రత్యేక ఆఫర్లు ఏమిటంటే.. ఈ ఆఫర్ కింద ప్రయాణించే ప్రయాణికులకు 3 కిలోల వరకు ఉచిత బ్యాగేజీ భత్యం అనుమతించబడుతుంది. అదేవిధంగా 15 కిలోల వరకు లగేజీపై రూ.1,000, 20 కిలోల వరకు లగేజీపై రూ.1,300 తగ్గింపును కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ ని ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే లాయల్టీ సభ్యులకు 8% న్యూకాయిన్స్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అంతే కాకుండా, ప్రైమ్ సీట్లు, ఆహారం, పానీయాలపై (On prime seats, food and beverages)47% తగ్గింపు కూడా ఉంది.

ఈ ప్రత్యేక ఆఫర్‌లో (offers) విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సైనిక సిబ్బందికి (Students, senior citizens, doctors, nurses, military personnel) ఉంటుంది అని ఎయిర్ ఇండియా తెలిపింది. దాని ప్రకారం.. అన్ని కొత్త ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-8 విమానాలలో ఎక్స్‌ప్రెస్ బిస్ ఛార్జీలు అందుబాటులో ఉండబోతుంది.

ఇక ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌లు అందుబాటులో ఉండబోతుంది. ఇక ఈ ఆఫర్సె ప్టెంబర్ 30 వరకు ఫ్రీడమ్ సేల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి రోజు అని తెలిపింది. అలాగే ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్ ఢిల్లీ, జైపూర్, బెంగళూరు మీదుగా 12 అంతర్జాతీయ విమానాలు, 32 దేశీయ విమానాల్లో ప్రయాణించడానికి అనుమతి ఇస్తుంది.