CAR: గత కొన్నేళ్లుగా ఆటో మొబైల్ కంపెనీలు డ్యూయల్ టోన్ కలర్స్‌లో కార్లను విడుదల చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కానీ కొన్ని సంవత్సరాల క్రితం కార్లు సింగిల్ కలర్‌లో మాత్రమే మార్కెట్లోకి వచ్చేవి. అప్పట్లో కారు యజమానులు కారుకు వేరే రంగులు వేసేవారు. ఈ కార్ల యజమానులు తమ కార్లను రోడ్డుపైకి తీసుకువెళ్లినప్పుడల్లా, పోలీసులు(The police) వారిని చాలా చోట్ల అపి అనేక ఇబ్బందులు పెట్టె వారు
అలాగే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వారి నుంచి జరిమానాలు కూడా వసూలు చేశారు.
మీరు మీ సింగిల్ కలర్ కారును మరో రంగులో మళ్లీ పెయింట్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ట్రాఫిక్ నియమాలను తెలుసుకోవాలి. అయితే మనలో ఎవరైనా సరే వాహనం రంగును మార్చడానికి మీరు మీ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) నుండి అనుమతి తప్పని సరి . మీరు ఆర్టీవో వద్ద పెయింట్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కొత్త రంగుతో అప్‌గ్రేడ్ చేయాలి. రంగు మారిన తర్వాత మీరు మీ ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి వాహన ధృవీకరణ పత్రం (RC)లో రంగు మార్పు అప్‌డేట్ గురించి కచ్చితంగా చెప్పాలి.
ఒక వేళా మనలో ఎవరైనా సరే ఆర్టీవో కార్యాలయంలో రంగు మార్పును అప్‌డేట్ చేయకపోతే, ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని కచింతంగా అడ్డు పడతారు . అలాగే జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. అలా చేయకపోతే ట్రాఫిక్ ఉల్లంఘనగా వారు పరిగణిస్తారు. భారతదేశంలో వాహనం రంగును మార్చిన తర్వాత మీరు ఆర్టీవోకి తెలియజేయకపోతే, మీరు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాహనాన్ని కూడా స్వాధీనం కూడా చూసుకునే అవకాశం కూడా ఉంది. అందుకే రంగు మారిన తర్వాత చట్టపరమైన విధానాన్ని పాటించడం మంచిది