Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chaina business : ఇల్లు కొంటే భార్య ఉచితం

--చైనాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వింత ఆఫర్లు --బిలియన్ డాలర్ల కంపెనీలు కుప్పకూలడంతో ఈ పరిస్థితి

ఇల్లు కొంటే భార్య ఉచితం 

–చైనాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వింత ఆఫర్లు
–బిలియన్ డాలర్ల కంపెనీలు కుప్పకూలడంతో ఈ పరిస్థితి

ప్రజా దీవెన/ చైనా: చైనాలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇల్లు కొంటె భార్య ఫ్రీ అని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన చేసింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం, చైనాలో ఆస్తుల విలువల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ రియల్ ఎస్టేట్ సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది.

ప్రస్తుతం పునరాలోచనలో చాలా జరుగుతున్నాయి. దీంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రకరకాల మార్కెటింగ్ వ్యూహాలతో ఇళ్లను విక్రయించడం ప్రారంభించారు. ఈ ప్రకటనల్లో వాళ్లలో ఎంత క్రియేటివిటీ వస్తుంది. గత రెండేళ్లగా చైనాలో నుంచి స్థిరాస్తి పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత నెమ్మదిగా నష్టాల ఊబిలో కూరుకుపో యింది.

ఫలితంగా అనేక బిలియన్ డాలర్ల కంపెనీలు కుప్పకూలా యి. దీంతో చైనాలోని నాలుగు సంపన్న నగరాల్లో ఇళ్ల ధరలు భారీ గా పడిపోయాయి. కొత్త ఇళ్ల విక్రయాలు కూడా తగ్గాయి. అంతేకా కుండా ఈ రియల్ ఎస్టేట్ మాంద్యం మరో రెండేళ్లపాటు కొనసాగు తుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా స్టాటిస్టిక్స్ విభాగం మాజీ హెడ్ షెంగ్ సాంగ్ చెంగ్ జోస్యం తెలిపారు.

దశాబ్దం క్రితం రెండంకెల వృద్ధిని సాధించిన చైనా ఆర్థిక వ్యవస్థ నాలుగో త్రైమాసికంలో కేవలం 5.2% వృద్ధితో ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. చైనీస్ రియల్ ఎస్టేట్ దిగ్గజం “ఎవర్‌గ్రాండ్” రెండేళ్ల క్రితం దివాళా తీయడంతో ఇబ్బంది మొదలైంది. ఆ తర్వాత అనేక బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలాయి. ఈ ప్రభావంతో చైనాలో ఇళ్ల ధరలు పాతాళానికి పడిపోయాయి.

కొత్త ఇళ్లు కొనుక్కునే వాళ్లే అవస్థలు పడుతున్నారు. చైనాలోని ప్రముఖ నగరాల్లో ఇళ్లకు డిమాండ్ కూడా పడిపోయింది. రియల్ ఎస్టేట్ కోలుకోవడానికి మరో రెండేళ్లు పడుతుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అంచనా వేసింది. దీంతో చైనాలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఇళ్లు అమ్మేందుకు ‘ఇల్లు కొనండి, భార్యను ఉచితంగా పొందండి’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని మరో కంపెనీ బంగారు కడ్డీలను ఇవ్వనున్నట్లు ప్రకటిం చింది. ఇల్లు కొనుక్కోవడం, భార్యను సంపాదించుకోవడంపై అంద రూ సీరియస్‌గా ఉన్నారు. ఈ ప్రకటన ఇచ్చినందుకు సదరు సంస్థకు రూ. 3 లక్షల జరిమానా విధించారు. ఈ వార్త నెట్టింట వైరల్ కావడం తో ఇదే ఆఫర్ రా సామీ అని వ్యాఖ్యానిస్తున్నారు. చైనా లో నెలకొన్న ఈ దారుణ పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా ఆయా వర్గాలు విస్తుపోతున్నాయి.