CNG bike: తాజాగా బజాజ్ (bajaj)కంపెనీ నుంచి ఆటో ఫ్రీడమ్ 125 బైక్‌ను (Freedom 125 bike) మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచంలోనే సిఎన్‌జితో నడిచే తొలి బైక్ ఇదే. ఇక ఈ సీఎన్‌జీ బైక్ ధర 95,000 రూపాయల నుండి 1.10 లక్షల రూపాయల వరకు ఉంటుందని కంపెనీ వారు తెలిపారు. ఈ బైక్ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ వాహనాన్ని తయారు చేసేందుకు బజాజ్ చేసిన R&D ప్రయత్నాన్ని నితిన్ గడ్కరీ అభినందించారు. ఇక ఈ బజాజ్ సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125 (Freedom 125 bike) ఆచరణలో ఎంత డబ్బు ఆదా చేయగలదో నితిన్ గడ్కరీ ఒక ఉదాహరణ కూడా తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం.. పెట్రోల్ ద్విచక్రవాహనం (Petrol bike)ధర కిలోమీటరుకు రూ.2.25గా ఉంది. అయితే, ఈ సీఎన్‌జీ బైక్ ధర కిలోమీటరుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే అని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనాల ఎగుమతిలో మేం నంబర్‌వన్. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే సీఎన్‌జీ బైక్‌లకు ఎక్కువ మార్కెట్ లభిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అంటూ నితిన్ గడ్కరీ అన్నారు.
ఫీచర్స్ ఇలా…
బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్‌లో డ్యూయల్ ట్యాంక్ (Dual tank) ఉండడం విశేషం. అలాగే సీటు కింద రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్, రెండు కిలోల సీఎన్‌జీ ట్యాంక్ కూడా ఉన్నాయి. కిలో సీఎన్‌జీ ధర రూ.60. ఒక కిలో సిఎన్‌జితో ఈ బైక్ 106 కి.మీల దూరం నడపగలదని బజాజ్ కంపెనీ కస్టమర్స్ కు తెలిపింది. పెట్రోల్ ట్యాంకుల స్థానంలో ఇథనాల్ ట్యాంకులను పెట్టాలని బజాజ్ ఆటోకు నితిన్ గడ్కరీ తెలిపారు. పెట్రోల్ కంటే ఇథనాల్ పర్యావరణ (Ethanol is environmental) అనుకూలమని వారి అభిప్రాయం. సిఎన్‌జి పెట్రోలియం ఉత్పత్తి అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే పర్యావరణానికి తక్కువ హానికరం అని తెలిపారు. ఇతర వేరియంట్లకు అనుగుణంగా ఇది అండర్ బాడీ ప్రొటెక్షన్ కోసం బెల్లీ పాన్, సౌకర్యవంతమైన ట్యాంక్ ఫ్లాప్ కలిగి ఉండడం ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
ఇక బజాజ్ ఫ్రీడమ్ 125 డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ (Disc LED variant) బ్లూ, బ్లాక్, వైట్, రెడ్ గ్రే వంటి విస్తృత రంగులలో ఉంది. దీని ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది లైనప్‌లో అత్యధిక ఫీచర్లను అందిస్తుంది. అందుకే ధర కూడా ఎక్కువగా ఉన్నటు తెలుస్తుంది.