Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Electricity Bills Payments: అలెర్ట్.. కరెంటు బిల్లులు ఇక నుంచి ఈ యాప్స్ లో పనిచేయవు..!

Electricity Bills Payments: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే (Phone Pay, Paytm, Google Pay)యాప్స్ అన్ని రకాల ప్రెమెంట్స్ (payments) చేసేవాటికి వాడుతూ ఉన్నారు. ఏకంగా చాల వరుకు ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లిస్తున్న సంగతి అందరికి విదితమే. ఇకపై ఇలాంటి వారికీ ముఖ్య గమనిక. ఈ నెల నుంచి ఆ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు (Electricity Bills Payments) కట్టడం సాధ్యము అవ్వదు. అంతే కాకుండా క్రెడిట్ కార్డుతో సహా.. ఆ థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సేవలను నిలిపి వేశారు.

ఇందుకు గల ముఖ్య కారణం ఏమిటంటే.. జూలై 1 నుంచి కొత్తగా ఆర్‌బీఐ రూల్స్ (rbi new rules)అమలులోకి రావడం. ఇకపై TGSPDCL, TGNPDCL, APSPDCL, APEPDCL, APCPDCL డిస్కమ్‌ల పరిధిలోకి వచ్చే అన్ని కరెంట్ బిల్లులు ఆయా సంస్థల అఫీషియల్ వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా మాత్రమే చెల్లించాలి.

ఇటీవల బిల్లు చెల్లింపుల్లో భద్రత కోసమే ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ బిల్ పేమెంట్ సిస్టం ద్వారానే బిల్లు చెల్లింపులన్నీ జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. ఈ కొత్త నిబంధనలన్నీ కూడా జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ (HDFC, ICICI Bank, Axis Bank) వంటి ప్రధాన బ్యాంకులు ఇంకా భారత్ బిల్ పేమెంట్ సిస్టంను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఆయా బ్యాంకులకు చెందిన కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించినట్లయితే.. ఆ ప్రెమెంట్స్ కూడా ప్రాసెస్ కావడానికి వీలు అవ్వదు. ఇక ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపులలోనూ అదే ప్రక్రియ ఫాలో అవుతుంది. ఈ విషయానికి సోషల్ మీడియా (social media)ద్వారా ప్రజలకు తెలిపారు.