Expensive Fish: ప్రపంచంలో మాంసం తినేవాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సముద్రాలున్న ప్రాంతాల ప్రజలు చేపల (Fish)ను రోజూ తింటారు. బెంగాల్ ప్రాంతం వాళ్లు చేపలంటే మరీ ఇష్టపడతారు. అక్కడే ప్రపంచంలో అతిపెద్ద చేపల మార్కెట్ ఉంది. చాలా దేశాలు చేపలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాయి. చేపలను వేలం వేసి అమ్మడం చాలా సాధారణం. ఇండియాలో కూడా చేపలను వేలం వేసి కొంటారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేపలు (Expensive fish) ఎన్నో ఉన్నాయి. ఇవి వేలం పాటలో చాలా ఎక్కువ ధర పలుకుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాయి. ముఖ్యంగా ఐదు చేపల ధరలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. అవేవో చూద్దాం.
బ్లూఫిన్ ట్యూనా (Bluefin Tuna): 2024 సంవత్సరంలో అత్యంత ఖరీదైన చేప ఇదే. ఈ చేప చాలా పెద్దగా ఉంటుంది. దీని ఆకారం ఒక తూటాను పోలి ఉంటుంది. ఈ చేప ఒక పౌండ్‌కు 5,000 డాలర్లు (సుమారు 4 లక్షల 20 వేల రూపాయలు) వరకు ధర పలుకుతుంది. ఇది చాలా రుచికరమైన చేపగా పరిగణించబడుతుంది.
అమెరికన్ గ్లాస్ ఈల్ (American Glass Eel) ఈ చేప ఉత్తర అమెరికా తీరంలో లభిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన చేప. ఇది చాలా చిన్నది, సుమారు 3 అంగుళాల పొడవు ఉంటుంది. ఇది గ్లాస్‌ను పోలి ఉంటుంది. అమెరికన్ ఈల్స్ 4 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి ఒక పౌండ్‌కు 3,000 డాలర్లు (సుమారు 2 లక్షల 52 వేల రూపాయలు) ధర పలుకుతాయి.
పఫర్ ఫిష్ (Pufferfish) ప్రపంచంలో చాలా ఖరీదైన చేపల్లో పఫర్ ఫిష్ కూడా ఒకటి. ఈ చేప చాలా ప్రమాదకరం కూడా. దీని ముళ్ళు చాలా విషపూరితమైనవి. అందుకే అమెరికాలో కొన్ని రెస్టారెంట్లలో మాత్రమే దీన్ని వడ్డిస్తారు. ఈ చేప ఒక పౌండ్‌కు 200 డాలర్లు (సుమారు 17 వేల రూపాయలు) వరకు ధర పలుకుతుంది.
వైల్డ్ అలాస్కన్ కింగ్ సాల్మన్: అలాగే, అలాస్కా రాష్ట్రంలోని చల్లటి నీటిలో కనిపించే వైల్డ్ అలాస్కన్ కింగ్ సాల్మన్ (Wild Alaskan King Salmon) చేప కూడా చాలా ఖరీదైనది. ఇది రెడ్ కింగ్ సాల్మన్‌ను పోలి ఉంటుంది. చాలా మందికి ఈ చేప చాలా ఇష్టం. అందుకే దీని ధర కూడా ఎక్కువే. ఈ చేప ఒక పౌండ్‌కు 70 డాలర్లు (సుమారు 5,884 రూపాయలు) వరకు ధర పలుకుతుంది.
స్వార్డ్ ఫిష్: స్వార్డ్ ఫిష్ (Swordfish) చేపకు కత్తిలాంటి ముక్కు ఉంటుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో నివసిస్తుంది. ఈ చేపను పట్టుకోవడానికి, తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ చేప 91 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ చేప ఒక పౌండ్‌కు 60 డాలర్లు (సుమారు 5,100 రూపాయలు) ధర పలుకుతుంది.