Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fastest Trains: అత్యంత వేగవంతమైన రైళ్లు ఇవే

Fastest Trains: మన భారతదేశపు 5 వేగవంతమైన రైళ్లు, (trains) సుదూర ప్రయాణానికి చాలా ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే భారతదేశం యొక్క 5 వేగవంతమైన రైళ్లు, సుదూర ప్రయాణానికి చాలా ప్రయోజనకరమైనవి భారతీయ రైల్వేలు కాలానుగుణంగా అనేక మార్పులు చేసారు. పాసెంజర్స్ (Passengers)ప్రయాణాలను సులభతరం చేసేందుకు అనేక కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు రైల్వే శాఖ వారు. ఇందులో భాగంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ..రైళ్ల వేగంలో అనేక మార్పులు వచ్చాయి. అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసే భారతదేశంలోని రైళ్ల గురించి మనం తెలుసుకుందాం..

మన భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ పొడవైన రైల్వే నెట్‌వర్క్‌గా (Railway network) పేరుగాంచాయి. అయితే ఆసియాలో రెండవ పొడవైన రైల్వే నెట్‌వర్క్. ప్రతిరోజు లక్షలాది మంది రైల్వే ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా చాల మంది ప్రయాణిస్తున్నారు. సాధారణ ప్యాసింజర్ రైళ్ల నుండి విలాసవంతమైన హై-స్పీడ్ రైళ్ల (High-speed trains) వరకు, భారతీయ రైల్వేలు ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, మెయిల్, DMU రైళ్లతో సహా అనేక రకాల సేవలను తన ప్రయాణీకుల భిన్నమైన అవసరాలను తీర్చెదనుకు బాగా షహాయ పడుతుంది. ఇందులో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగవంతమైన రైలుగా అందరు అనుకుంటారు.

ఆ లిస్ట్ విషయానికి వస్తే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ,గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ,రాజధాని ఎక్స్‌ప్రెస్,దురంతో ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express, Gatiman Express, Rajdhani Express, Durantho Express)ముందు వరసలో ఉన్నాయి. మన భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి. ఈ ట్రైన్ గంటకు 180 కి.మీ కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతీయ రైల్వేలలో వేగం విషయంలో వందే భారత్‌నే ప్రమాణాలను కూడా నెలకొల్పింది. ప్రస్తుతం ఈ ట్రైన్ గంటకు 120 నుండి 130 కిమీల వేగంతో నడుస్తోంది.

అలాగే మన భారతదేశంలో రెండవ అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ (Gatiman Express). ఇది రైల్వే శాఖ 2016లో ప్రవేశపెట్టబడింది. ఈ రైలు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించడం ప్రత్యేకం. వేగంతో పాటు ఇందులో కల్పించిన సౌకర్యాలు కూడా ప్రయాణీకుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ఉంటుంది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. రైలు నంబర్లు 12049/12050 కింద నిర్వహించబడుతుంది.

భారతదేశంలో మూడవ అత్యంత వేగవంతమైన రైలు భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్(Bhopal Shatabdi Express). ఈ ట్రైన్ న్యూ ఢిల్లీ, భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ మధ్య నడుస్తున్న ఈ రైలు గంటకు 150 కి.మీ వేగంతో నడుస్తుంది. అలాగే ఇష్టమైన, వేగవంతమైన రైళ్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్ ,దురంతో ఎక్స్‌ప్రెస్ కూడా ఉన్నాయి. ఇవి గంటకు 140 కి.మీ ,135 కి.మీ వేగంతో పరుగులు పెడ్తున్నాయి. దురంతో ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బయలుదేరిన స్టేషన్ నుంచి నాన్-స్టాప్‌గా 493 కిలోమీటర్ల దూరం వరుకు ప్రయాణం కొనసాగిస్తోంది. దీంతో దేశంలో ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణించిన రైలుగా మంచి ఆదరణ పొందింది.