Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అంటే మన డబ్బును కొంత కాలం పాటు బ్యాంకులో పెట్టుబడి పెట్టడం. ఆ డబ్బును సురక్షితంగా దాచుకోవడానికి, దానిపై వడ్డీ సంపాదించడానికి ఎఫ్‌డీ మంచి మార్గం. బ్యాంకులో పెట్టిన డబ్బును ఎవరూ తీసుకోలేరు. కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) ఉపయోగపడుతుంది. వివిధ బ్యాంకులు విభిన్న వడ్డీ రేట్లు ఇస్తాయి. ఎక్కువ వడ్డీ (Interest rate) ఇచ్చే బ్యాంకును ఎంచుకోవడం మంచిది. ఎంత కాలం పాటు డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో దాని ఆధారంగా కాలపరిమితిని ఎంచుకోవాలి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనేది మన దేశంలోని బ్యాంకులకు బాస్‌లా చేస్తుంది. ఈ ఆర్‌బీఐ దేశంలోని డబ్బు విలువను నియంత్రిస్తుంది. ఈ నియంత్రణలో భాగంగా, బ్యాంకులు ఒకదానికొకటి డబ్బు ఇచ్చుకునేటప్పుడు వసూలు చేసే వడ్డీ రేటును ‘రెపో రేటు’ అంటారు. ఈ రేటు తగ్గితే, బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇస్తాయి. అదేవిధంగా, మీరు బ్యాంకులో డబ్బు పెడితే, మీకు వచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది.
ప్రస్తుతం, రెపో రేటు స్థిరంగా ఉంది. అంటే, ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, మంచి వడ్డీ వస్తుంది. ముఖ్యంగా, మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లు చాలా బాగున్నాయి. అయితే, ఆర్‌బీఐ త్వరలో రెపో రేటు (Repo rate)ను తగ్గించవచ్చు అని అంచనా. రేటు తగ్గితే, భవిష్యత్తులో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వచ్చే వడ్డీ తగ్గుతుంది. రెపో రేటు తగ్గే అవకాశం ఉంది కాబట్టి, ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే, ఇప్పుడే చేయడం మంచిది. ముఖ్యంగా, మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఎంపిక. అన్ని బ్యాంకులు ఒకే వడ్డీ రేటు ఇవ్వవు. కాబట్టి, వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి, అత్యంత లాభదాయకమైన ఎంపికను ఎంచుకోవాలి. ప్రస్తుతం ఐదు బ్యాంకులు హైయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తున్నాయి అవి చూద్దాం.
• ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు
SBI: భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన SBI, మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు 6.75%, సీనియర్ సిటిజన్లకు 7.25% వడ్డీ ఇస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంకు సాధారణ ప్రజలకు 6.5%, సీనియర్ సిటిజన్లకు 7.15% వడ్డీ ఇస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ఈ బ్యాంకు సాధారణ ప్రజలకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.6% వడ్డీ ఇస్తుంది.
HDFC బ్యాంక్, ICICI బ్యాంక్: ఈ రెండు బ్యాంకులు కూడా సాధారణ ప్రజలకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీ ఇస్తున్నాయి.
యాక్సిస్ బ్యాంక్: ఈ బ్యాంకు సాధారణ ప్రజలకు 7.1%, సీనియర్ సిటిజన్లకు 7.6% వడ్డీ ఇస్తుంది.