Foldable Phone: ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో ఫోల్డబుల్ ఫోన్‌ల (Foldable Phone) మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. యూజర్లు ఫోల్డబుల్ ఫోన్‌లను (Foldable Phone) కూడా బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు అయినా Samsung, Motorola, Huawei వంటి ఇతర మొబైల్ తయారీ కంపెనీల ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్‌లు (Folding and flip phones) మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్‌లో, ఆపిల్ (apple) కూడా ఫోల్డబుల్ ఐఫోన్‌లో పనిచేస్తోందని ఒక నివేదిక ద్వారా తెలిసింది. అయితే దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐఫోన్ నుంచి ఏదైనా ఫోన్ విడదలకు సంబంధించి అప్‌డేట్ వచ్చిందంటే చాలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. అయితే 2026 ప్రారంభంలో ప్రపంచంలో ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేయవచ్చని కంపెనీ అంచనావేస్తుంది. చాలా కాలంగా ఫోల్డబుల్ ఐఫోన్ తీసుకురావాలని వినియోగదారుల నుండి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం
కొన్ని నివేదికల ప్రకారం, ఫోల్డబుల్ ఫోన్ (Foldable Phone) పని ఆలోచన దశను దాటి ముందుకు సాగింది. ఇది కాకుండా, ఫోల్డబుల్ ఫోన్‌లలో ఉపయోగించే భాగాల కోసం కంపెనీ ఆసియాలోని (Asia)సరఫరాదారులను కూడా కాంటాక్ట్ అయ్యినట్టు సమాచారం. ఇది కాకుండా, కంపెనీ ఈ ఉత్పత్తి కోసం V68 అనే ఇంటర్నల్ కోడ్‌ను కూడా సృష్టించింది. ఇక ఆపిల్ కంపెనీ ఎప్పుడు ఫోల్డబుల్ ఫోన్‌ని విడుదల చేసినా శాంసంగ్ ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లతో దానికి ప్రత్యక్ష పోటీ ఉంటుంది. ఇక వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించడానికి 2019లో ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఫోన్‌ను విడుదల చేసిన మొదటి సంస్థ శాంసంగ్. అప్పటి నుండి ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌ల ట్రెండ్ వేగంగా పెరగడం మొదలు అయ్యేంది.
ఇక జూలై ప్రారంభంలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ (Galaxy Unpacked event) 2024లో Samsung Galaxy Z Fold, Z Flip AI ఫీచర్లతో పరిచయం మార్కెట్లో చేయబోతుంది . ఇక Samsung దీన్ని తేలికగా, సన్నగా ఉండేలా అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో చైనా మొబైల్ కంపెనీలు Honor, Huawei కూడా ఈ విభాగంలో ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసింది. గ్లోబల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొదటి త్రైమాసికంలో 49% వృద్ధి చెందింది. ఆరు త్రైమాసికాలలో దాని అత్యధిక వృద్ధి రేటు, హువావే శామ్‌సంగ్‌ను అధిగమించి మొదటి సారి అగ్రస్థానంలో నిలిచిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం, రాయిటర్స్ దీని గురించి ఆపిల్‌ను అడగగా, ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించి వారి వైపు నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు . చూడాలి మరి ఎప్పటికి ఈ ఫోల్డబుల్ ఫోన్ యూజర్స్ కోసం మార్కెట్ లోకి వస్తుందో.