Gas Cylinder: నిత్యం వాడే వస్తువులలో వంట గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) కూడా ఒకటి. అయితే వంట గ్యాస్ సిలిండర్ లేనిది మనం వంట కూడా చేసుకోలేము. గ్యాస్ సిలిండర్ ఎంత ధర ఉన్న కూడా మనం కొనాల్సిందే. ఇక తాజాగా ఎల్‌పీజీ సిలిండర్లకు (LPG cylinders) అతి త్వరలో క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తెలిపారు. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్ Tracking of cooking gas cylinders) కోసం, ఏజెన్సీల ఇన్‌వెంటరీ నిర్వహణకు ఈ క్యూఆర్ కోడ్ అనేది బాగా ఉపయోగ పడుతుంది అని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ (QR code)ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ జీసీఆర్‌లో పొందుపరిచినట్లు అయినా చెప్పారు. అతి త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందనీ గ్యాస్ సరఫరాలోని (gas supply) అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్‌ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుందని గోయల్ అన్నారు. ఇక నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు (petrol pump) పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పెసో ను ఆదేశాలు జారీ చేసారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సీపీసీబీ మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం – డీపీఐఐటీ కింద పని చేసే పెసో, 1884 ఎక్స్‌ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పరివేక్షణలో ఉంది తెలిపారు. పెసో మంజూరు చేసిన లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్‌ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి తెలిపారు..ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఏజెన్సీల ఇన్‌వెంటరీ నిర్వహణకు చెక్ పెట్టవచ్చు కొందరు అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Prev Post