Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gas Cylinders: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త..?

Gas Cylinders: గడిచిన నాలుగో నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల (Gas Cylinders) ధరలు (rates) వరుసగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (Gas Cylinder)ధర రూ.150 తగ్గింది. మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలు మార్చి 9 నుంచి నిలకడగానే ఉంటుంది. గత 10 నెలల్లో ప్రభుత్వం కూడా గృహ గ్యాస్ సిలిండర్ ధరను రూ.300 తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని మరొక అంచనా . ఇది ఇలా ఉండగా మరోవైపు రాబోయే నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల (Gas Cylinder) ధర మరింత తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారాం. ఇక గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇక జూలై 1న వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు చమురు (oil) కంపెనీలు ఊరటనిచ్చాయి. ఆయిల్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.30 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ప్రస్తుతం ఢిల్లీలో ధర రూ.1,646కు తగ్గింది. నేటి నుంచే అమల్లోకి వచ్చే కొత్త ధరలు ఇవే.. దేశీయ గ్యాస్ సిలిండర్ (Domestic gas cylinder)ధరలో మార్చి నుంచి ఎలాంటి మార్పు లేదు. చివరగా మార్చి 9న గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.100 తగ్గించారు. అంతకు ముందు ఆగస్టు 30న దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింది. గత 10 నెలల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో కేవలం రెండు మార్పులు మాత్రమే వచ్చాయి అనే చెప్పెలి,

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు (Commercial cylinder prices) ఢిల్లీ- రూ.1,646 ,హైదరాబాద్‌ – రూ.1,872,విజయవాడ – రూ.1,832,విశాఖపట్నం – రూ.1,704,ముంబయి – రూ.1,598,కోల్‌కతా – 1,756,చెన్నై – రూ.1,809,బెంగళూరు – రూ.1,724 తిరువనంతపురం – రూ.1,676. ఒక రకంగా ఇది సామాన్యులకు గుడ్ న్యూస్ అనే చెప్పలి.