Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Indian Railways: రైల్లో చైన్ లాగితే శిక్ష ఏమిటి…?

Indian Railways: మన భారత దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ ఇండియన్‌ రైల్వే ( Indian Railway). ప్రపంచంలోనే మన భారతీయ రైల్వే నాలుగో స్థానంలో ఉంది. అయితే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ (Railway Department) ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకోని రావడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం .అయితే రైల్వే నిబంధనలు కూడా ఎప్పటికిప్పుడు మారుస్తూనే ఉంటారు. అయితే ఎటువంటి కారణం లేకుండా రైళ్లు ఆలస్యంగా రావడంతో చాలా సార్లు ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే రైలులో చైన్‌ లాగడం ప్రధానమైనది. కానీ చైన్ లాగడం వల్ల రైళ్లు (trains) తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యమవుతుంది.

ఈ క్రమంలో రైళ్లు అనవసరంగా ఆలస్యం కాకుండా చూసేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ ‘టైమ్ కీపింగ్’ (‘Time Keeping’) కింద అలాంటి వారిపై నిఘా కూడా పెట్టాయి . రైలులో చైన్‌ లాగినందుకు ఎంతో మందిపై అనేక చర్యలు తీసుకుంటున్నారు రైల్వే అధికారులు. అలాగే పెద్ద ఎత్తున జరిమానాలు సైతం విధిస్తున్నారు.ఒక ప్రయాణికుడు ఎటువంటి సరైన కారణం లేకుండా అనవసరంగా చైన్ లాగితే లేదా ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తే, అతనిపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పదు అంటున్నారు అధికారులు. అలాగే అలారం చైన్‌ని లాగడం వల్ల ఆ రైలుతో పాటు, ఆ ట్రాక్‌పై (track) తర్వాత వచ్చే అన్ని ఇతర రైళ్లు కూడా లేట్ అయ్యే అవాకాశాలు ఎక్కువ. ఇక వాస్తవానికి రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం.. సరైన కారణం లేకుండా రైలు అలారం చైన్‌ను లాగితే రూ.1000 జరిమానా లేదా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడుతుంది.అలాగే ఇలా చేసే ప్రయాణికుడికి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది.

వాస్తవానికి ట్రైన్‌లో (train) చైన్ ఏ సమయంలో లాగవచ్చు అంటే.. మనం ప్రయాణించే రైలులో మంటలు చెలరేగితే,,ప్రయాణ సమయంలో మీతో పాటు వృద్ధులు లేదా వికలాంగులు ఉంటే, వారు రైలు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే, రైలు కదలడం ప్రారంభిస్తే అటువంటి పరిస్థితిలో అలారం చైన్ లాగవచ్చు. అలాగే మనం రైలు ప్రయాణంలో ఉన్న సమయంలో ఎవరైనా దొంగతనం (theft) లేదా దోపిడీ కి పాల్పడితే చైన్ పుల్లింగ్ కూడా చేయవచ్చు. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు చైన్ (chain) లాగితే మాత్రం శిక్ష తప్పదు.