IT Returns File:మన భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను రిటర్న్స్ (IT Returns File) దాఖలు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (for the financial year)సంబంధించిన ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి జూలై 31తో గడువు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ గడువు లోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ ((IT Returns File) )చేయకపోతే జరిమానాలతో పాటు వడ్డీ చార్జీలను కూడా పే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జరిమానాలు ఫైలింగ్ ఎంత ఆలస్యమైందనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనం చెల్లించే పన్ను బట్టి ఈ ఫీజు మారడం జరుగుతుంది. ఇక ఈ ఐటీ రిటర్న్స్ సకాలంలో ఫైల్ చేయడం ద్వారా అనవసరమైన ఆర్థిక భారాలను నివారించవచ్చని నిపుణులు తెలియచేస్తున్నారు. ఒకవేళ పన్ను రీఫండ్‌కు అర్హత ఉంటే ఐటీఆర్‌ను తక్షణమే ఫైల్ చేయడం వల్ల మీరు మీ రీఫండ్‌ను త్వరగా కూడా పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ (refund) ప్రాసెసింగ్ మొదలు అవుతుంది. కనుక ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ (itr file) చేయడం ఆలస్యం చేయడం వల్ల మీ రీఫండ్ కూడా ఆలస్యం అవుతుంది.అయితే ఐటీఆర్‌కు సంబంధించిన ఫైలింగ్ గడువు పొడిగిస్తారని చాల మంది అంచనా వేస్తున్నారు కానీ ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి గడవు తేదీ పొడగించే అవకాశం లేదని ప్రముఖ నిపుణులు చెబుతున్నారు. అయితే గడువు దాటాక ఆలస్య రుసుముతో మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2024గా ఉంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్‌ను ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ ((IT Returns File) ) చేయడం వల్ల కలిగే నష్టాల విషయానికి వస్తే సెక్షన్ 139(1) ప్రకారం నిర్దేశించిన గడువు తేదీ తర్వాత రిటర్న్‌ను సమర్పిస్తే ఆదాయపు రిటర్న్‌ను అందించడంలో డిఫాల్ట్‌కు రుసుము రూ. 5,000 అవుతుంది. అయితే అసెస్సీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షలు మించకుండా ఉంటే రుసుము రూ. 1,000గా కూడా ఉంటుంది. అలాగే పన్నులపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అసలు గడువు తేదీ నుండి పూర్తి మొత్తం సెటిల్ అయ్యే వరకు ఈ వడ్డీ కూడా వస్తుంది. ఇక సెక్షన్ 276 సీసీ ప్రకారం చెల్లించాల్సిన పన్ను మొత్తం లేదా ఎగవేత మొత్తం రూ. 25,000 దాటితే ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసినందుకు జరిమానాతో పాటు 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు (jail)శిక్ష, జరిమానా (fine)పడే అవకాశం కూడా ఉంటుంది.