Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

JIO New Plan: అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ ప్రకటించిన జియో

JIO New Plan: మన భారతదేశంలోని టెలికం కంపెనీలన్నీ కూడా ఇటీవల కాలంలో రీచార్జ్ ప్లాన్స్ (Recharge plans) ధరలను పెంచిన విషయం అందరికి తెలిసిన విషయమే. బీఎస్ఎన్ఎల్ (bsnl)తప్ప అన్ని కంపెనీలు రీచార్జ్ ప్లాన్స్ ధరలను దాదాపు 20 నుంచి 30 శాతం వరకు పెంచడం మనం చూసాము. ఈ క్రమంలో సగటు వినియోగదారుడు తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ ప్లాన్స్ కోసం వెతకడం మొదలు పెడ్తారు. ఈ నేపథ్యంలో జియో సైలెంట్‌గా మరో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను యూజర్స్ కోసం ప్రకటించింది . కొత్త ప్లాన్‌ కేవలం రూ.198 ధరతో అపరిమిత సేవలను అందించే విధానంగా ప్రకటించింది. ఈ క్రమంలో ఇతర టెలికం కంపెనీలకు కట్టి పోటినిచ్చేలా జియో రిలీజ్ చేసిన నయా ప్లాన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం..

జియో కొత్త రూ. 198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (Recharge plans) ఇప్పటికే జియో (jio) వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. ఇది కంపెనీకు సంబంధించిన అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్స్ జాబితాలో ఉంది. అలాగే దీని స్థానంలో రూ. 349 ప్లాన్ అర్హత ఉన్న పరికరాలలో అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించడానికి అత్యంత సరసమైన మార్గమని అందరి అభిప్రాయం. అయితే రూ. 198 ప్లాన్ ద్వారా ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2 జీబీ 4జీ డేటాను కూడా అందిస్తుంది. అలాగే ఇతర ప్లాన్‌ల మాదిరిగానే డేటా అయిపోయిన తర్వాత వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గిపోయింది. ఇక డేటాతో పాటు రిలయన్స్ జియో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను చేసుకునే అవకాశం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా (jioCloud, Jio TV, Jio Cinema) లాంటి యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను కూడా యూజర్స్ అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే అని జియో తెలిపింది.

అయితే జియో రూ.349 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో (valditiy)వస్తుంది. కానీ, అతి త్వరలోనే ఆ ప్లాన్ జియో అందించే అవకాశం ఉండదని నిపుణులు అంచనా కూడా ఉన్నట్టు సమాచరం. అయితే మరో వైపు జియో గట్టిపోటీనిచ్చే ఎయిర్‌టెల్ ఈ ధరలో ఎలాంటి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను కూడా తీసుకోని రాలేదు. ఎయిర్‌టెల్ అపరిమిత 5జీ ప్లాన్ ప్రారంభ ధర రూ. 379గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో ఎక్స్‌ట్రీమ్ ప్లే, వింక్ మరియు హలో ట్యూన్స్‌లకు ఉచిత యాక్సెస్‌ ఉంటుంది.